Telangana cm KCR will attend Amaravati inauguration

Kcr will attend amaravati inauguration

Amaravati, KCR, Chandrababu Naidu, KCR to Amaravati, Amaravati inauguration, Amaravati inauguration ceremony, KCR at Amaravati Inauguration, Chandrababu Naidu invites KCR, Chandra Babu naidu with KCR, Telangana CM KCR, Chandrababu Naidu at Amaravati, New capita; Amaravati

If Chandrababu Naidu invite telangana cm KCR will attend the inauguration of the ap new capital Amaravati. Chandrababu Naidu already told that he will invite KCR in personal.

అమరావతి శంఖుస్థాపనకు కేసీఆర్ వెళతారు.. కారణాలు ఇవే

Posted: 10/15/2015 11:07 AM IST
Kcr will attend amaravati inauguration

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపన అంగరంగ వైభవంగా ఏర్పాట్లకు సిద్దమైంది. ఏపి సిఎం నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి శంఖుస్థాపనకు రంగం సిద్దం చేస్తున్నారు. అయితే దేశ, విదేశాల నుండి వచ్చే అతిరథ మహారథులకు అమరావతి అపురూప ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 1500 మంది విఐపిలు, వంద మందికి పైగా వివిఐపిలు అమరావతి శంఖుస్థాసనకు హాజరవుతారని తెలుస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమానికి మోదీ వచ్చే దానికన్నా... మరో వ్యక్తి వస్తారా రారా అని కీలకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి ఏపికి, తెలంగాణకు మధ్యన దూరం పెరిగింది. నేతల మాటలు రెండు రాష్ట్రాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. అయితే మరి తాజాగా అమరావతి శంఖుస్థాపనకు కేసీఆర్ వస్తారా.? రారా..? అన్న దాని మీద చర్చ సాగుతోంది.

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తానని మంత్రి వర్గ భేటీలో వెల్లడించారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలను చంద్రబాబు స్వయంగా ఇస్తున్నారు. నరేంద్ర మోదీని నిన్న కలిసిన చంద్రబాబు ఖచ్చితంగా రాజధాని శంఖుస్థాపనకు రావాలని కోరారు. అలాగే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లను ఆహ్వానిస్తున్నారు. అందులొ భాగంగా ఈ నెల 18న చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను స్వయంగా కలిసి అమరావతి శంఖుస్థాపన ఆహ్వాన పత్రికను అందించనున్నారు. మరి కేసీఆర్ అమరావతి శంఖుస్థాపనకు వెళతారా..? వెళ్లరా అనే చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కు చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి కోపం లేదు. రాజకీయంగా పార్టీలు వేరు.. సిద్దాంతాలు వేరు కాబట్టి ఒకరి నుండి మరొకరు విభేదిస్తారు. కాబట్టే ముందు నుండి తెలంగాణ సిఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో విభేదించారు. కానీ గతం గడిచింది.. తెలంగాణ, ఏపిలు రెండు కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు తారా స్థాయికి చేరాయి. కేంద్ర ప్రభుత్వం వరకు తెలంగాణ, ఏపిల తగాదా చేరింది. అయితే అది తర్వాత కొంత కాలానికి సద్దుమణిగింది. ఇప్పుడు ఎవరి రాష్ట్రానికి సంబందించిన అంశాల మీద వారు దృష్టిసారించారు.

సిఎం కేసీఆర్ స్వతహాగా మంచి వ్యక్తి. పంతాలు పట్టింపులు పెద్దగా పట్టవు. అమరావతి శంఖుస్థాపన లాంటి చారిత్రక ఘట్టానికి.. గతంలో జరిగిన వివాదాలకు ముడిపెట్టి.. పోల్చుకునే స్థాయి వ్యక్తి కాదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గత అనుభవాలను మరిచిపోయి.. కేసీఆర్ ను స్వయంగా తానే ఆహ్వానిస్తానని వెల్లడించారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకటే లక్షం.. ఒకటే ధ్యేయం. తమ రాష్ట్రాలను అభివృద్ది చెయ్యాలని.. తమ రాష్ట్రాలను దేశంలోనే అగ్రగాములుగా తీర్చిదిద్దాలని.. అందుకు ఎంతో కష్టపడిపనిచేస్తున్నారు. అమరావతి శంఖుస్థాపనకు కేసీఆర్ వెళ్లేందుకు సిద్దంగానే ఉన్నారు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లూ ఇచ్చారు. ఏపి ప్రభుత్వం ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళతామని.. పెద్ద మనసుతో ఆశిర్వదిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

ఏఫి ప్రజల గురించి గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏపి ప్రజలు కూడా అభివృద్ది చెందాలని మిగిలిన రాష్ట్రాలకు పోటీనివ్వాలని ఆకాంక్షించారు. ఏపి ప్రజలకు తాను కూడా బాసటా నిలుస్తానని అన్నారు. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఏపి ప్రజలకు ఎలాంటి భయం లేదని.. వారికి తాను అండగా ఉంటానని కూడా వెల్లడించారు. ఇలా ఉద్యమం ముగిసిన తర్వాత కేసీఆర్ ఏపి పట్ల, ఏపి ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నారు. మోదీతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వెళుతున్న నేపథ్యంలో తెలంగాణ సిఎంగా తాను వెళ్లకపోతే బాగుండదు అనే బావనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సంబందాలను తిరిగి పునరుద్దరించడానికి కేసీఆర్ ఖచ్చితంగా ముందు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి ఈ కారణాల వల్లే కేసీఆర్ అమరావతి శంఖుస్థాసనకు వెళతారు అని అందరి అభిప్రాయం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles