Ap Govt Has Decided Sai Kumar As Anchor For Amaravathi Inaugural Programme | AP CM Chandrababu Naidu

Sai kumar voice over in amaravathi inaugural programme ap cm chandrababu naidu

sai kumar news, sai kumar updates, sai kumar voice over for amaravathi, sai kumar controversies, amaravathi inaugural programme, singer sunitha, raithu vandanam programme, kuchipudi style dancers

Sai Kumar Voice Over In Amaravathi Inaugural Programme Ap Cm Chandrababu Naidu : Ap Govt Has Decided Sai Kumar As Anchor For Amaravathi Inaugural Programme Along With Cultural Programmes.

‘అమరావతి’ శంకుస్థాపనలో డైలాగ్ కింగ్ వాయిస్

Posted: 10/15/2015 10:25 AM IST
Sai kumar voice over in amaravathi inaugural programme ap cm chandrababu naidu

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. మూడు దేశాలకు చెందిన ప్రధానమంత్రులతోపాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకా ఎందరో నేతలను ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఇంకా ఎందరో రైతులతోపాటు సాధారణ ప్రజలు కూడా హాజరు కానున్న ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా కన్నులపండుగలా కనువిందు చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం విశేషం.

ఈ విధంగా నిర్వహించనున్న ఈ శంకుస్థాపన నిర్వహణను (యాంకరింగ్) డైలాగ్ కింగ్ సాయికుమార్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. అంతేకాదు.. ప్రారంభానికి ముందు సభలో ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శనతోపాటు కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో ‘మన అమరావతి’ (50 మంది డాన్సర్లు కూచిపూడి స్టైల్లో 12 నిముషాలపాటు ‘జయ జయహే అమరావతి’ పాటకు డాన్స్ చేయనున్నారు), ‘రైతుకు వందనం జానపద (7 నిముషాల ప్రోగ్రామ్)’, ‘కూచిపూడి’ నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సాయికుమార్ తోపాటు ప్లేబ్యాక్ సింగర్ సునీతా కూడా యాంకరింగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదిలావుండగా.. 40 ఏళ్లుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సాయికుమార్.. ఈ ప్రతిష్టాత్మక రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తుండడం.. ఆయన జీవితంలో అదో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా సాయికుమార్ వాయిస్ ఓ మైలురాయిగా నిలవనుంది. అటు ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి సాయికుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai kumar  amaravathi inaugural programme  ap cm chandrababu naidu  

Other Articles