Telangana govt decided to collect tax on tvs

Have to pay tax for watching tv

Hyderabad, Tax, Tv, Entertainment, Telangana, tax, Tax for Entertainment

Telangana govt recently decided to collect new tax on tv viewers in Hyderabad. Telangana govt first implement tax in Hyderabad after it will expand to full state.

టివీ చూసినందుకు ట్యాక్స్ కట్టాలి

Posted: 10/14/2015 04:37 PM IST
Have to pay tax for watching tv

హైద‌రాబాద్‌ లో సామాన్యుల‌కు చిక్కొచ్చి ప‌డింది. క‌రెంటు బిల్లు క‌ట్టినా, హోట‌ల్లో భోజ‌నం చేసినా..  ప‌న్నులు లేదా స‌ర్వీసు చార్జీల పేరిట ప్రత్యేక రుసుం వ‌సూలు చేసే విధానం ఇక్కడ క‌చ్చితంగా అమ‌లవుతోంది. తాజ‌గా వాటి జాబితాలోకి టీవీ కూడా చేరిపోయింది… ఇదేం చోద్యం టీవీ చూసినా ప‌న్ను వేస్తారా? అంటూ ఎవ‌రు ఆశ్చర్యపోయినా.. ఇది న‌మ్మలేని నిజం! ప్రభుత్వం గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కేబుల్ క‌నెక్షన్లపై వినోద‌పు ప‌న్ను వ‌సూలు చేయాల‌ని నిర్ణయించింది. ఇక‌పై ప్రతి ఇంటికి 5రూపాయల చొప్పున వినోద‌పు ప‌న్ను పేరిట వ‌సూలు చేయాల‌ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. త్వర‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణయించిన‌ప్పటికీ తొలుత గ్రేట‌ర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. వాస్తవంగా జీహెచ్‌ఎంసీ కేబుల్ టీవీ కనెక్షన్ల చార్జీలపై 20 శాతం వినోద పన్ను వసూలు చేసి అందులో రెండు శాతాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆయితే జీహెచ్‌ఎంఎసీ అధికారులు కేబుల్ కనెక్షన్ల రాబడిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వినోద పన్ను వసూళ్లు లేకుండాపోయాయి.  

గ్రేటర్ హైదరాబాద్‌ లో సుమారు 24 లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, మరో 4 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌ఓగా ఉన్న సిటీ కేబుల్, హాత్‌ వే, డిజీ కేబుల్, ఆర్‌ వీ ఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ప్ర‌తి వినియోగ‌దారుడి నుంచి ఇవి రూ.150-200 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాయి. ఈ లెక్క‌న  గ్రేటర్‌లోని వినియోగదారులపై నెలకు సుమారు 1.20 కోట్ల అదనపు భారం పడనుంది. ఏదో ఎంటర్ టెన్ మెంట్ కోసం టీవీలు చూద్దామనుకుంటే అది కూడా లేకుండా చేస్తారా ఏంటి అని అడిగే వాళ్లు అడిగినా.. ప్రభుత్వానికి రాబడి కావాలి మరి కొత్తగా జేబుకు చిల్లుపడుతోంది సిద్దంగా ఉండంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Tax  Tv  Entertainment  Telangana  tax  Tax for Entertainment  

Other Articles