Constable Wife | MRA Marg police station | GRP constable | Wadala | Usha Katkar | Ashok Ravji Kamble

Mumbai constables wife turns thief to provide for family arrested

MRA Marg police, GRP constable wife Usha Katkar, Ashok Ravji Kamble, CST station, Tilak Nagar, CCTV footage, Wadala, thievery to overcome financial crisis, Constable Kisan Katkar's wife, Constable Wife Turns Thief, Usha Katkar, MRA Marg police

Officials from MRA Marg police station arrested the wife of a GRP constable from their Wadala residence

ఆమె పోలీసు భార్యే... కాదు కాదు దొంగే..! ఎందుకలా..?

Posted: 10/14/2015 04:22 PM IST
Mumbai constables wife turns thief to provide for family arrested

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ పోలీసు కానిస్టేబుల్ భార్య దొంగగా మరింది. అమె పోలీసు భార్యే.. కానీ దొంగగా మారింది. అయితే కుటుంబానికి జీవనాధారం లేకపోవడం వల్లే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అమె దొంగగా మారింది. సుఖవంతమై సంసార జీవితానికి భర్త అనే వాడు, అతని సంపాదన ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తుంది. భర్త అనుకోని కారణాలతో జైలుపాలు కావడం, తన కుటంబపోషణ భాధ్యత తనపై వేసుకున్న పోలీసు భార్య.. అనుకోకుండా దొంగగా మారాల్సి వచ్చింది. ఇది తమ గూటికి చెందిన వ్యక్తి కథ అని తెలిసి కూడా పోలీసులు అమెను అరెస్టు చేశారు.

అయితే అమెను అరెస్టు చేసి తమ ఉద్యోగబాధ్యతను నేరవేర్చిన పోలీసులు అమె పరిస్థితి చూసి.. అమెకు బెయిల్ పోందేందుకు కూడా సహాయం చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ ఏమా కథ..? అనుకుంటున్నారా..? ఎమ్మార్ఏ మార్గ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జీఆర్పీ కానిస్టేబుల్ కిసాన్ కట్కర్ భార్య ఉషా కట్కర్(40) ఈనెల 3న సీఎస్టీ స్టేషన్ వెలుపల దొంగతనానికి పాల్పడింది. అశోక్ రావ్ జీ కాంబ్లి(58) అనే వ్యక్తి నుంచి బ్యాగ్ కాజేసింది. ఇందులో రూ. 16 వేల నగదు, సెల్ ఫోన్ ఉన్నాయి. బాధితుడు తన కొడుకు పెళ్లి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసి తిలక్ నగర్ లోని తన ఇంటికి వెళుతుండగా ఈ చోరి జరిగింది.

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వాదాలాలోని తన ఇంట్లో ఉన్న ఉషను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంటరాగేషన్ లో ఆమె చెప్పిన మాటలు ఖాకీలను కదిలించాయి. మిస్ ఫైర్ కేసులో తన భర్త అరెస్టైన నాటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆమె తెలిపింది. కుటుంబాన్ని పోషించేందుకు తాను దొంగగా మారాల్సి వచ్చిందని వెల్లడించింది. కర్లా జీఆర్పీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉష భర్త కిసాన్ ను 2011లో అరెస్ట్ చేశారు. లోకల్ ట్రైన్ లో డ్యూటీ చేస్తుండగా అతడి చేతిలో తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటన జరిగినప్పుడు కిసాన్ మద్యం మత్తులో ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable Wife  MRA Marg police station  GRP constable  Wadala  Usha Katkar  Ashok Ravji Kamble  

Other Articles