CBI To Lodge Charge Sheet On Vijay Mallya For Transfering 4000 crores To Other Countries Which is Taken From Banks | Vinay Mallya Crime News

Cbi to lodge charge sheet on vijay mallya for transfering 4000 crores to other countries

Vijay Mallya News, Vijay Mallya Scam, Vijay Mallya kingfisher, Vijay Mallya controversies, Vijay Mallya updates, Vijay Mallya chargesheet, Vijay Mallya cbi investigation, Vijay Mallya news, Vijay Mallya black money, kingfisher calender

CBI To Lodge Charge Sheet On Vijay Mallya For Transfering 4000 crores To Other Countries : CBI To Lodge Charge Sheet On Vijay Mallya For Transfering 4000 crores To Other Countries Which is Taken From Banks As Loans.

మాల్యా ‘నల్ల’రంగు భారీగా బయటపడింది!

Posted: 10/14/2015 11:13 AM IST
Cbi to lodge charge sheet on vijay mallya for transfering 4000 crores to other countries

విజయ్ మాల్యా.. ఒకప్పుడు దేశంలో ఓ వెలుగు వెలిగిన కింగ్ ఫిషర్ యజమాని. తనకెవరూ సాటిలేరని గొప్పలు చెప్పుకుని డప్పు వాయించుకుంటూ తిరిగిన పెద్ద బిజినెస్ మేన్. అప్పట్లో ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయాడు. కట్ చేస్తే.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. నిన్నటిదాకా జల్సాగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఇరుక్కుపోయాడు. నిత్యం వార్లల్లోకెక్కే ఈ మనిషి ఇప్పుడు కనుమరుగయ్యాడు. ఇంతలోనే మనోడి ‘నల్ల’రంగు బయటపడింది. ఎన్నో వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణం తీసుకుని వాటికి టోకరా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఐడిబిఐ బ్యాంకు మంజూరు చేసిన 900 కోట్ల రుణంపై సిబిఐ కేసు నమోదు చేయగా.. ఇప్పుడు 3100 కోట్ల రుణంపై మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మన దేశంలోని బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా తీసుకున్న రుణాలను నల్లధనం కేంద్రాలుగా ఉన్న కొన్ని దేశాలకు తరలించాడని సిబిఐ విచారణలో తేలింది. ఈ మేరకు అబియోగాలు మోపడానికి సిబిఐ  రంగం సిద్దం చేస్తోంది. మాల్యా వివిధ బ్యాంకుల నుంచి నాలుగు వేల కోట్ల రుణం తీసుకున్నారు. అందులో పలుమోసపూరిత పద్దతులకు పాల్పడ్డాడన్నది అబియోగంగా ఉంది. ఐడిబిఐ బ్యాంకు మంజూరు చేసిన 900 కోట్ల రూపాయల రుణంపై ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేయగా.. మరో 3100 కోట్ల రూపాయలను ఇతర బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్న వైనంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. నిజానికి.. కింగ్ ఫిషర్ సంస్థ నష్టాలలో ఉందని అంతర్గత నివేదికలు చెబుతున్నప్పటికీ ఈ బ్యాంకులు అతనికి ఇంత భారీ మొత్తాన్ని రుణాలుగా ఎలా ఇచ్చాయన్నది అంతుచిక్కని ప్రశ్నార్దకంగా మారింది.

అంత భారీ డబ్బును విమానాలను అద్దెకు తీసుకోవడానికి, ఇతరత్రా ఇన్వాయిస్ లను పెంచి ఇతర దేశాలకు మళ్లీంచాడని మాల్యా తీసుకుని వుంటాడని సిబిఐ అనుమానిస్తోంది. కేమన్ ఐలాండ్స్, మారిషస్ దేశాలకు ఇలాంటి లావాదేవీల పేరుతో విజయ్ మల్యా తరలించారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశాలకు దీనిపై సిబిఐ లెటర్ రొగెటరీని జారీ చేయబోతోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya Controversies  CBI ChargeSheets  Mallya Black Money  Kingfisher  

Other Articles