Another Controversy Raised On Ap Capital Amaravathi Invitation Card | Andhra Pradesh State | Amaravathi Master Plan

Ap capital amaravathi invitation card in language controversy andhra pradesh state

amaravathi news, ap capital city amaravathi, amaravathi master plan, amaravathi updates, amaravathi master plan updates, amaravathi work starts, amaravathi invitation card, telugu launguage people

Ap Capital Amaravathi Invitation Card In Language Controversy Andhra Pradesh State : Another Controversy Raised On Ap Capital Amaravathi Invitation Card. Some People Demands To Print Cards In Telugu Language Only.

వివాదంలో ‘అమరావతి’ ఆహ్వాన పత్రిక

Posted: 10/13/2015 09:55 AM IST
Ap capital amaravathi invitation card in language controversy andhra pradesh state

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’పై మొదటి నుంచి ఎన్నో వివాదాలు రాజుకుంటూ వచ్చాయి. తొలుత భూసేకరణ విషయమై కొందరు రైతులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు విపక్ష పార్టీలు సైతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందంటూ ఆరోపణలు చేస్తూ.. రైతులను రెచ్చగొట్టిన సందర్భాలూ వున్నాయి. అయితే.. ఆ వివాదాలు ఎలాగోలా సమసిపోయాయి. రాజధాని నిర్మాణానికి అన్ని పనులు సన్నద్ధమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి కూడా. కానీ.. ఇంతలోనే మరో వివాదం తెరమీదకొచ్చింది. అమరావతి నిర్మాణానికి హాజరు కావాలంటూ ప్రముఖుల కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై తాజాగా ఈ వివాదం రేగింది.

తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని అని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ఆహ్వాన పత్రం ఆంగ్లంలో ముద్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు భాషోద్యమ సమాఖ్య నేత సామల రమేష్ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఆహ్వాన పత్రికను తెలుగులో ముద్రించకపోతే తాము ఆందోళన చేస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నిర్మాణానికి కూడా ఆంగ్ల ఆహ్వాన పత్రిక ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే తెలుగులో ఆహ్వాన పత్రికను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చారు. ఈయన డిమాండ్ కు మరికొందరు తెలుగు భాషా ప్రేమికులు మద్దతుగా నిలిచారు. మరి.. ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! మరోవైపు.. ఈ వివాదాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi invitation card  ap cm chandrababu naidu  

Other Articles