YS Jagan is the Trend setter

Ys jagan is the trend setter

YS Jagan, jagan Trend, Jagan protest, Jagan hunger strike, JaganMohan Reddy, Jagan on Special Status, Jagan in Guntur, YS JaganMohan Reddy, YS Jagan strike, jagan about status

YS Jagan hunger strike trend on social media. Jagan did six days fasting protest in Guntur for the special status for the state of AP. Police foiled his strike on today early morning.

జగన్ ట్రెండ్ సెట్ చేస్తారా.? అసలు నిజం ఇది

Posted: 10/13/2015 10:02 AM IST
Ys jagan is the trend setter

ఏపిలో ప్రత్యేక హోదా కోసం జగన్ ఆరు రోజులగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారు జామున నాలుగు గంటలకు పోలీసులు దీక్షా స్థలికి చేరుకొని జగన్ ను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. జగన్ ఆరోగ్యపరిస్థితి అంతకంతకు క్షీణిస్తుండటంతో ఎంత మాత్రం మంచిది కాదు అని బావించిన పోలీసులు జగన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ కు తెలుగు మీడియాతో పాటుగా, జాతీయ మీడియాలో కూడా కవరేజ్ సరిగ్గాలేదని వైసీపీ నాయకులే వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్ట్ అమర్ లాంటి వ్యక్తి కూడా ఇదే మాట అన్నారు. మీడియా పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. కానీ అలా అన్న ఒకటి, రెండు రోజులకు సోషల్ మీడియాలో జగన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అది ఎలా సాధ్యం నిన్నటి దాకా జగన్ కు మీడియాలో ప్రచారం లేదని అనుకుంటే.. వెంటనే ప్రచారం ఎలా వచ్చింది. దీక్షా స్థలి వద్ద ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోలేదు. కేంద్రం నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ జగన్ దీక్ష మీద ఎలాంటి ప్రకటన రాలేదు మరి ఇది ఎలా సాధ్యం....?

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరు రోజులుగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు. గుంటూరు వేదికగా సాగిన జగన్ దీక్ష ముందు నుండి కీలక పరిణామాలకు వేదికగా మారింది. జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాలో దీక్షకు అనుమతినివ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే జగన్ మాత్రం ఖచ్చితంగా దీక్ష చేపట్టితీరుతానని అన్నారు. అన్నట్లుగానే జగన్ దీక్షకు దిగారు. అయితే పోలీసులు మాత్రం దీక్ష ప్రారంభించినా కానీ ఎలాంటి అరెస్టులు చెయ్యలేదు. నిజానికి జగన్ ను అలా అరెస్టు చేస్తే.. అనవసరంగా హీరోను చేసినట్లు అవుతుందని.. అలా కాకుండా దీక్షను అణగదొక్కితే జనాలకు కూడా జగన్ మీద ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్ రాదు అని అధికారపక్షానికి చెందిన వారి ఆలోచన కావచ్చు. కానీ పోలీసులకు కూడా సాంకేతిక కారణాలు ఉండవచ్చు.

జగన్ దీక్షకు దిగారు.. ఒకటో రోజు. రెండు రోజు.. ఇలా ఐదు రోజులు గడిచింది. కానీ ఎలాంటి స్పందన లేదు. కానీ జగన్ చేస్తున్న దీక్ష మీద తెలుగు మీడియాలోనే పెద్దగా కవరేజ్ లేకుండా పోయింది. దీనికి కారణం అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు అండ్ కేబినెట్ చేస్తున్న ఏర్పాట్ల మీద మీడియా దృష్టిసారించింది. జగన్ దీక్షలో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి.. అమరావతి శంఖుస్థాపన మీద కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా తర్వాత ఒక్కో మంత్రి జగన్ కు వ్యతిరేకంగా రకరకాల స్టేట్ మెంట్స్ ఇచ్చారు. దాంతో జగన్ క్యాంప్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. నిజానికి అధికారపార్టీ నాయకుల మాటలకు జగన్ వర్గం నుండి ఎవరూ కూడా సమాధానం ఇవ్వలేదు ఇది జగన్ కు మైనస్.

జగన్ దొంగ దీక్ష చేస్తున్నారని.. మంత్రి పత్తిపాటి పుల్లారావు, మంత్రి కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. బ్లడ్ లో షుగర్ లెవల్స్ తక్కువగా నమోదై తర్వాత మళ్లీ ఎలా పెరిగాయని వాళ్లు ప్రశ్నించారు. కానీ జగన్ వర్గం నుండి కనీసం రోజా కానీ, బొత్స సత్యనారాయణ కానీ, మైసూరా కానీ మరొకరు కానీ ధీటైన సమాధానం ఇవ్వలేదు. అధికారపక్షానికి చెందిన నాయకులు దీన్ని బాగా వాడుకున్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి.. దీక్ష మీద జనాల్లో సింపధీరాకుండా చూశారు. మరి ఇంత నెగిటివ్ వేరియన్స్ ఉన్నా.. జగన్ ఎలా ట్రెండ్ సెట్ చేశారు.?

జగన్ ట్రెండ్ సెట్ చెయ్యడానికి రెండు రకాల దారులున్నాయి. ఆ రెండింటిలో ఏదో ఒకటి జగన్ వర్గం వాడుకొని ఉండవచ్చు. ఒకటి గతంలో అన్నా హజారే ఉద్యమం సమయంలో టెక్కీలు వాడిన టెక్నిక్. అంటే కొన్ని కాలేజీల విద్యార్థులు, కార్పోరేట్ సంస్థల ద్వారా జగన్ దీక్ష మీద విపరీతమైన ప్రచారం డబ్బులు ఇచ్చి చేసి ఉండవచ్చు. ఇలా చాలా స్పీడ్ గా సోషల్ మీడియాలో ప్రాచరం చెయ్యడం ద్వారా జగన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ కావొచ్చు. లేదంటే దీనికి వంద శాతం వ్యతిరేకమైన ఘటన జరిగి ఉండవచ్చు.

జగన్ కు తెలుగు రాష్ట్రాల్లో బలమైన క్యాడర్ ఉంది. జగన్ కు ఐటీ వింగ్ బలంగా ఉంది.. టెక్నాలజీని బాగా వాడుకోవడంలో కూడా జగన్ వర్గం సక్సెస్ అయి ఉండచ్చు. మామూలుగానే జనాధరణ ఉన్న జగన్ దీక్ష మీద అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అదే పనిగా ప్రాచరం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి రెండు రోజులు వ్యవధిలోనే జగన్ ట్రెండ్ గా నిలచి ఉండవచ్చు. అయితే మొత్తానికి జగన్ మీద ఎలక్ట్రానిక్ మీడియా ఇటు తెలుగులో, అటు జాతీయ మీడియా కూడా వివక్ష చూపించింది అన్నది మాత్రం వాస్తవమే అనిపిస్తోంది. మరి నిజానికి గ్రౌండ్ లెవల్ లో ఏం జరిగింది అన్నది వైసీపీ పార్టీ నాయకులే వివరించాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles