Talasani On Revath Reddy

Do not attempt to remove feathers on a chicken egg

Talasani, Revanth Reddy, Talasani Srinivas yadav, Eetela Rajender, TRS Govt, Hostels, Rice to Hostels, Sonamasuri Rice, Polished Rice for Hostels, Revanth Reddy on Etela

Talasani Srinivas slams Revanth reddy for Hostel rice statements. Revanth reddy attacked on Eetala, TRS govt on suppling rice to hostels.

రేవంత్.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం వద్దు

Posted: 10/13/2015 09:17 AM IST
Do not attempt to remove feathers on a chicken egg

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీద చేసిన విమర్శలను తలసాని శ్రీనివాస్ ఖండించారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంటే.. మీకు మాత్రం లావు బియ్యలాగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. దొరల పంచన చేరిన ఈటెల కూడా అలానే తయారయ్యారని రేవంత్ వ్యాఖ్యాలను తలసాని వ్యతిరేకించారు. కాగా నోటికి తోచింది మాట్లాడితే తాను ఊరుకున్నా.. తన వాళ్లు మాత్రం ఊరుకోరని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు తలసాని. కోడి గుడ్డు మీద రేవంత్ రెడ్డి ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని తలసాని హితవు పలికారు.

హాస్టల్ విద్యార్థులకు లావు బియ్యం కాకుండా కేవలం సన్న బియ్యం మాత్రమే పంపిణీ చెయ్యాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయం వెనుక ఈటెల రాజేందర్ కృషి ఉంది. ఈటెల హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నిజానికి సన్న బియ్యం పేరుకు మాత్రమే అని లావు బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటెల అంటే తనకు గౌరవమేనని .. కానీ హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోందని అన్నారు. కావాలంటే ఈటెల రాజేందర్ తన నియోజక వర్గమైన కొడంగల్ కు వస్తే హాస్టల్ కు వెళ్లి వాస్తవాలను నిరూపిస్తానని అన్నారు రేవంత్ రెడ్డి. మొత్తంగా హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం వ్యవహారం రేవంత్ రెడ్డి, ఈటెల, తలసాని మధ్య మాటల యుద్దానికి తెర తీసింది. మరి రేవంత్ రెడ్డి సవాల్ కు ఈటెల సిద్దపడతారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles