Two Yadavs two diffrent words on Bihar

Two yadavs two diffrent words on bihar

Lalu Prasad, Mulayam Singh Yadav, Bihar, Elections, Modi, BJP, Bihar Elections 2015, Bihar polls

Two yadav leaders spoke diffrent words on Bihar elections result. Mulayam SIngh Yadav hope BJP will win the Bihar Elections.

బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలు

Posted: 10/13/2015 08:28 AM IST
Two yadavs two diffrent words on bihar

బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కన్పిస్తోందని, తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ములాయం జోస్యం చెప్పారు.   ఈ నేపధ్యంలో  ఎస్పీ చీఫ్  ములాయం ఈ వ్యాఖ్య చేసి  జేడీయూ- ఆర్జేడీ – కాంగ్రెస్ అలయన్స్ ను చిక్కుల్లో పడేశారు.  కాషాయ పార్టీ ప్రభుంజనం కన్పిస్తోందని..  బీజేపీ పార్టీయే  తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.  బీజేపీ ప్రభుత్వం  చేసే మంచిపనులను  తాను మెచ్చుకుంటానని కూడా ములాయం తెలిపారు.  పశుగ్రాసం కుంభకోణంలో  కోర్టు శిక్ష విధించిన  లాలూప్రసాద్ యాదవ్ తో  అవినీతిని వ్యతిరేకించే నితిశ్ కుమార్  చేతులు కలపడాన్ని ఆయన సన్నిహితులే జీర్ణించుకోలేకపోతున్నారని,  ఆర్జేడీ చీఫ్ లాలూను జేడీయూ నేత బుట్టలో వేశారని  ములాయం ఎద్దేవా చేశారు. నితిశ్ కుమార్ ,  లాలూ ప్రసాద్ యాదవ్  జనతా పరివార్  పునరుద్ధరణ ఏర్పాట్లను  దెబ్బతీశారని సమాజ్ వాదీ పార్టీ నేత  ములాయం విమర్శించారు.

బీహార్ లో మొదటి దశ ఎన్నికలు ముగివాయో లేదో వెంటనే లో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీహార్‌ లో ఓడిపోతే ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయగలరా అని ఆర్జేడీ అధినేత సవాల్ చేశారు. మూడు నెలలుగా బీహార్‌ లో ప్రచారం చేస్తున్న మోడీ.. ఫలితాల తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. మరోవైపు 25 ఏళ్ల నుంచి బీహార్‌ ను పాలిస్తున్న పెద్దన్న, చిన్నన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని పరోక్షంగా లాలూ, నితీష్ ల మీద ప్రధాని మోడీ ఆరోపించారు.  అభివృద్ధి కోరితే బీజేపీని గెలిపించండని కోరారు. జెహానాబాద్‌ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. మహాకూటమి నేతలకు చురకలంటించారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్‌ కిబాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటానంటూ కార్యక్రమాన్ని ఆపేసేందుకు మహా కూటమి నేతలు తీవ్రయత్నాలు చేశారని మోడీ విమర్శించారు. తన మన్‌ కీ బాత్ కార్యక్రమంతో కూడా మహాకూటమి నేతల్లో భయం నెలకొందని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad  Mulayam Singh Yadav  Bihar  Elections  Modi  BJP  Bihar Elections 2015  Bihar polls  

Other Articles