Telangana Minister KTR missed masti in Assembly

Ktr missed masti in assembly

Assembly, KTR, Telangana, Water Grid, Minister KTR, Telangana Assembly

In Telangana Assembly, minister KTR missed the opposition party leaders in this sessions. He explains the Watergrid project in the assembly.

మజా మిస్సైందంటున్న కేటీఆర్

Posted: 10/07/2015 09:51 AM IST
Ktr missed masti in assembly

మీరు మాట్లాడుతున్న దాంట్లో తప్పులున్నాయి.. మీరు చెప్పింది అసలు నిజం కాదు.. ప్రభుత్వం మాటలు చెబుతుంది కానీ చేతుల మాత్రం శూన్యం ఇలా రకరకాల మాటల ప్రతిపక్షాలకు చెందిన నేతలు సందిస్తుంటే ప్రభుత్వం నుండి సమాధానాలు రావాలి. కానీ తెలంగాణ అసెంబ్లీలో అలాంటి సీన్ లేదు. ఎందుకంటే అసలు అసెంబ్లీ సమావేశాల నుండి ప్రతిపక్షాలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తూ బయటకు నెంటేశారు. మరి అలాంటప్పుడు మంత్రులు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎలాంటి చర్చ ఉండదు. అయితే అదే సీన్ కేటీఆర్ కు కూడా ఎదురైంది. దాంతో వాళ్లు ఉంటే మజా ఉండేదని.. వాళ్లు లేకపోవడంతో మజా రాలేదని అన్నారు. మొత్తానికి కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను బాగా మిస్ అవుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై షార్ట్ డిస్కషన్ జరిగింది. ఈ పథకంపై మంత్రి కేటీఆర్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విపక్షాల ఆరోపణల్లో పసలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా పాడుకాకుండా పనులు చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో 20వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందన్న కేటీఆర్... ప్రస్తుతం 106 వాటర్ గ్రిడ్ ప్లాంట్లు ఉన్నట్లు చెప్పారు. 226 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ను దాటాల్సి ఉందని, దాంతో పాటు ఆరు శాఖలను సమన్వయం చేసుకుని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వాటర్ గ్రిడ్ పైప్ లైన్లను తెలంగాణ ప్రజల లైఫ్ లైన్లుగా అభివర్ణించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్. వాటర్ గ్రిడ్ పూర్తయ్యాక తెలంగాణలో ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం రోడ్డెక్కాల్సిన అవసరం రాదని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly  KTR  Telangana  Water Grid  Minister KTR  Telangana Assembly  

Other Articles