YS Jaganmohan Reddy missed his flight in the Hyderabad. Jagan started to Guntur, but he missed his flight.

Ys jagan missed the flight

Jagan, Guntur, Protest, flight, AP, Hyderabad, YS Jagan

Y S Jagan, Guntur flight, Andhra Pradesh, Hyderabad

పాపం. జగన్ మిస్సయ్యాడు

Posted: 10/07/2015 10:20 AM IST
Ys jagan missed the flight

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ గుంటూరు వేదికగా దీక్షకు దిగుతున్నారు. గుంటూరులో అక్కడి పరిస్థితిని నాయకులు అంతా ముందుండి సమీక్షిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఏమీ స్పందిచకుండా ఉన్నారు. జగన్ దీక్షకు ఎక్కడెక్కడి నుండో జనాలు పోగేసే పనిలో జగన్ అనుయాయులు బిజీబీజీగా ఉన్నారు. అయితే గుంటూరులో మరికొద్దిసేపట్లో జగన్ అట్టహాసంగా దీక్షకు సిద్దమవుతున్న తరుణంలో అప్పుడే జగన్ కు చేదు వార్త ఎదరైంది జగన్ మిస్సయ్యారు.. జగన్ మిస్సయ్యారు ఏం చేద్దాం అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే అయ్య రాలేదని.. అమావాస్య ఆగుతుందా..? అని ఓ నానుడి. అది జగన్ కు కూడా వర్తిస్తుంది మరి.

 

జగన్ గుంటూరులో దీక్షకు అంతా సిద్దమైంది. అయితే హైదరాబాద్ నుండి బయలుదేరుతున్న జగన్ కు అభిమానులు నీరాజనం పలికారు. అయితే అలా జగన్ బయలుదేరడం లేట్ కావడంతో ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ మిస్ అయింది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక చివరకు రోడ్డు మార్గంలో గుంటూరుకు బయలుదేరారు. మొత్తానికి కాసేపు ఫ్లైట్ మిస్సైన కాసేపు మాత్రం జగన్ అభిమానుల్లో కలకలం రేగింది. మొత్తానికి ఆట మొదలుకాకముందే.. జగన్ దీక్షకు ముందే ఫ్లైట్ మిస్ కావడం కొంత మంది అపశకునంగా బావిస్తున్నారు మరి. ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Guntur  Protest  flight  AP  Hyderabad  YS Jagan  

Other Articles