AP Cm Chandrababu Naidu plans to Grand inauguration of Amaravati

Grand inauguration of amaravati

Amaravati, AP, Chandrababu Naidu, Capital, inauguration, Babu, Modi, Modi to Amaravati

APs new capital Amaravati inauguration on this Dasara with Grand arrangements. Chandrababu naidu specially taking care about the opening caremony of Amaravati

ఓపెనింగ్ అదిరిపోవాలంటున్న చంద్రబాబు

Posted: 10/07/2015 09:45 AM IST
Grand inauguration of amaravati

అవును.. ఓపెనింగ్ అంటే ఏదో సినిమా ఓపెనింగ్ అనుకునేరు. కాదు కాదు కొత్త రాజధాని అమరావతి శంఖుస్థాపన మీద చంద్రబాబు దృష్టిసారించారు. ఆరంభం అందిరిపోవాలంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపనను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.   పుష్కరాలను మించిపోయేలా ఏర్పాట్లు చేయాలని, ఈ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా అమరావతి పేరు మారుమ్రోగాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.   గన్నవరం నుంచి.. రాజధాని ప్రాంతం వరకూ. అడుగడుగునా స్వాగత తోరణాలతో  ఆ ప్రాంతం రూపురేఖలు మారేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ సిద్ధమవుతోంది. శంకుస్థాపనకు తరలివచ్చే వీవీఐపీ, విదేశీ అతిధులను గన్నవరం నుంచి శంకుస్థాపన ప్రాంతానికి తరలించడానికి..  పదహారు హెలికాప్టర్లను ఏర్పాటుచేస్తున్నారు.
 
పుష్కరాలను నిర్వహించిన తీరులోనే.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పుష్కరాలకు చేసినట్లే.. లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే విద్యుత్ శాఖను ఆదేశించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రజలకు  ఉచిత బస్సులను ఏర్పాటు చేయనుంది. శంకుస్థాపన రోజు రాత్రి పూట సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు లైవ్లో చూపించడానికి గుంటూరు, విజయవాడల్లోని ప్రధాన కూడళ్లలో భారీ ఎల్ సీడీ స్క్రీన్లనూ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. రాజధాని శంకుస్థాపన పనులు మొదలుపెట్టామన్నారు ప్రతి గ్రామం నుండి ఒక లీటరు నీరు, ఒక కిలో మట్టి తీసుకురావాలని.. దాంతో అమరావతి చిహ్నాన్ని నిర్మించనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  AP  Chandrababu Naidu  Capital  inauguration  Babu  Modi  Modi to Amaravati  

Other Articles