ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీ బిజిబిజీగా గడిపారు. కేంద్రంలోని ప్రముఖులను కలిసి అమరావతి నిర్మాణం మీద, స్వచ్ఛ భారత్, కొన్ని సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చాలా సేపు చర్చించిన చంద్రబాబు మోదీ నుండి అభయం అందుకున్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు నిర్మించతలపెట్టిన నూతన రాజధాని అమరావతి గురించి నరేంద్ర మోదీ అన్ని వివరాలు అడిగితెలుసుకున్నారు. మోదీ రాజధాని ప్లాన్ గురించి.. ఎంత కాలం ఎంత వ్యయంతో కూడిందన్న విషయాలను కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఏపికి నిధుల కేటాయింపులు, ప్రత్యేక హోదా మీద నానా రాద్దాంతం నడుస్తున్న నేపధ్యంలో చంద్రబాబు మోదీని ప్రసన్నం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
దసరా నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపి నూతన రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునాది పడనుంది. అయితే రాజధాని పనులను ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు సాగరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి ఖచ్చితంగా వస్తానని మోదీ హామీ ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. అలాగే అమరావతి నిర్మాణంలో తలెత్తె చిన్న చిన్న సమస్యలను పరిఫ్కారమయ్యేలా చూడాలని కూడా చంద్రబాబు మోదీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పలు ప్రాజెక్టుల అనుమతులు, రెవెన్యూ లోటును ఎలా పూడ్చాలన్న దాని మీద కూడా చంద్రబాబు నాయుడు మోదీతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున చెయ్యగలిగే సహాయాన్ని తప్పకుండా చేస్తామని మోదీ పూర్తి భరోసా ఇచ్చారని బాబు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more