Opposition parties call for Bandh

Opposition parties call for bandh

Telangana, farmers, Suicide, Bandh, Oppositions, TDP, Congress, YSRCP, Assembly

Opposition parties call for Bandh. Opposition parties in the Telangana state call for Bandh on this month 10th. Govt failed to stop the suicides of farners in the state of telangana.

తెలంగాణ బంద్ కు పిలుపు

Posted: 10/06/2015 08:43 AM IST
Opposition parties call for bandh

తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న నాటకీయ సస్సెన్షన్ ఎపిసోడ్ మీద అన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అధికారపక్షం కనీసం ప్రతిపక్షాలను మాట్లాడకుండా నిరంకుశంగా చేసస్తోందని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను సస్సన్డ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రైతుల ఆత్మహత్యల మీద, రైతులకు వన్ టైం సెటిల్ మెంట్ చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా అధికారపక్ష తీర్మానం మీద చర్చించడానికి ముందుకు రాకుండా ప్రతిపక్ష నాయకులను సభలోనుండి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంది. అయితే దీని మీద అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం తలవంచేలా తమ కార్యాచరణను ప్రకటించాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షపార్టీలు ఈ నెల 10వ తేదిన బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి, వైసీపీ, సిపిఐ,సిపిఎం పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముందుగానే బంద్ పాటించాలని అనుకున్నా అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత బంద్ మీద స్పష్టమైన ప్రకటన చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, తెలుగుదేశం తెలంగాణ పార్టీ నేత రేంవత్ రెడ్డి వెల్లడించారు. బంద్ మీద తెలుగుదేం పార్టీ తెలంగాణ నాయకుడు ఎల్. రమణ ప్రకటన చేశారు. అన్ని పక్షాలు సంయుక్తంగా బంద్ లో పాల్గొంటాయని.. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. రైతులు ఎవరూ అదైర్ఘ్యపడవద్దని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  farmers  Suicide  Bandh  Oppositions  TDP  Congress  YSRCP  Assembly  

Other Articles