FIR on Hyderabad MLA in Bihar

Fir on hyderabad mla in bihar

Akbaruddin, Owisi, Bihar, MLA, Elections, Modi, Bihar elections, AKbaruddin on Modi

FIR on Hyderabad MLA in Bihar. Bihar Kisangunj Police filed a FIR on Hyderabad MLA Akbaruddin Owisi. Akbaruddin sentensed some contraversial comments about one group of religion.

హైదరాబాద్ ఎమ్మెల్యే మీద బీహార్లో కేసు

Posted: 10/06/2015 09:11 AM IST
Fir on hyderabad mla in bihar

బీహార్ లో ఎన్నికల యుద్దం నడుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ దగ్గరి నుండి అందరూ బీహార్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే అసలే ఎన్నికలు ఆ మీద ప్రత్యర్థుల మీద మాటల తూటాలు పేలకపోతే ఎలా.? అలా మాటల తూటాలు పేలి పేలి చివరకు కేసుల దాకా వెలుతున్నాయి. అయితే ఎన్నికలు మాత్రం బీహార్ లో... కేసు నమోదైంది మాత్రం హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యే మీద. అవును హైదరాబాద్ ఎమ్మెల్యే మీదే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న దాని మీద కేసు నమోదు చేశారు. ఇంతకీ ఎవరా హైదరాబాదీ ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? అయితే స్టోరీ చదవండి.

బీహార్ ఎన్నికల ర్యాలీలో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ మీద, పార్లమెంట్ సభ్యలు మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాకుండా ఎంపీలను తిట్టిపారేశారు. అలాగే ఓ వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దాంతో స్థానిక పోలీసులు అక్బరుద్దీన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కిసాన్ గంజ్ పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 144 కింద ఉల్లంఘనలకు పాల్పడ్డారని... సెక్షన్ 153ఎ మరియు 188 ఐపిసి సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ అక్బరుద్దీన్ మోదీ మీద తీవ్రంగా ఆగ్రహం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశానికి దెయ్యం లాంటి వారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చెయ్యాలనుకుంటే బీఫ్ ను కాదు మోదీ విదేశీ పర్యటనలను బ్యాన్ చెయ్యాలని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akbaruddin  Owisi  Bihar  MLA  Elections  Modi  Bihar elections  AKbaruddin on Modi  

Other Articles