Play Stopped as Fans Hurl Water Bottles

Play stopped as fans hurl water bottles

Team India, India, South Africa, cricket, Match, South Africa series,Cuttack, Barabati Stadium

Play Stopped as Fans Hurl Water Bottles . Angry and disappointed spectators hurled missiles, mainly water bottles, into the cricket ground after India were bundled out for 92 against South Africa in the second T20 International at the Barabati Stadium in Cuttack.

టీమిండియా ‘చెత్త’ ప్రదర్శన

Posted: 10/06/2015 08:42 AM IST
Play stopped as fans hurl water bottles

కటక్ లో జరిగిన టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతో అభిమానించే మైదానంలోకి చెత్త చేరింది... తమ అభిమాన ఆటగాళ్లు చెత్త పర్ఫామెన్స్ కు ప్యాన్స్ కు కోపం వచ్చింది. దాంతో స్టేడియంలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీమిండియా ప్లేయర్ లు పేలవమైన ఆటతో ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచారు. సౌతాఫ్రికా   టీ- 20  సీరీస్ లో  2-0తో విజయం సాధించింది. కటక్ లో జరిగిన రెండో  టీ- 20 మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. విజయానికి 92 పరుగులు అవసరం కాగా, ఆ స్కోరును  సౌతాప్రికా 17.1 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన భారతజట్టు  17.2 ఓవర్లలో  92 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

 ప్రేక్షకుల అల్లరి , ప్లాస్టిక్ బాటిల్స్  విసిరి, నిరసన తెలిపిన కారణంగా  ఆట నిలిపి వేశారు. ఆట నిలిచిపోయే సమయానికి  ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ఇక 42 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన స్థితిలో ఏడు వికెట్లు చేతిలో ఉండగా ఆట ఆగింది. ప్రేక్షకులు బాటిల్స్ విసురుతున్నందువల్ల  గాయపడే అవకాశం ఉందని  బ్యాట్స్ మన్, ఇతర ఆటగాళ్లు అనుమానం వ్యక్తం చేయడంతో అంపైర్లు ఆట నిలిపి వేశారు. చాలా సేపు స్టేడియంలోనే గడిపిన  ఆటగాళ్లు అంతా  పెవిలియన్ దారి పట్టగా,   అంపైర్లు,  మ్యాచ్ అధికారులు   ఫీల్డ్ లో చర్చిస్తూనే గడిపారు.   ప్రేక్షకులు  ప్లాస్టిక్ బాటిల్స్ ను విసురుతున్న సమయంలో  విధినిర్వహణలో ఉన్న పోలీసులు  ఆట చూస్తూ,  ప్రేక్షకులను పట్టించుకోకపోవడం పట్ల  క్రికెట్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేసారు.  చాలా సేపు ఆట నిలిచి పోవడంతో  విసిగి పోయిన  పలువురు ప్రేక్షకులు ఇంటి దారి పట్టారు.  అంతకు ముందు  బ్యాటింగ్ చేసిన ధోనీ సేన పేలవంగా ఆడి దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. సౌతాఫ్రికాతో  కటక్ లో జరుగుతున్న రెండో టీ – 20  మ్యాచ్ లో   దక్షిణాఫ్రికా  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసే అవకాశాన్ని  ఇండియాకు ఇస్తే..  చురుగ్గా పరుగుల వర్షం కురిపించి భారీ విజయ లక్ష్యం ఇవ్వాల్సిన జట్టు బోల్తా పడింది. అంతర్జాతీయ ర్యాంకింగ్ లో మూడు ఫార్మెట్లలోనూ  ప్రముఖ జట్టుగా పేరొందిన  టీమిండియా జట్టు  20 ఓవర్లు పూర్తి కాకముందే  17.2  ఓవర్లకు కేవలం  92 పరుగులకు ఆలౌట్ అయింది. 120 బంతుల మ్యాచ్ లో కనీసం  బంతికో పరుగు కూడా చేయలేకపోవడంతో  కటక్ ప్రేక్షకులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక దశలో  ప్రేక్షకులు తమ చేతులలోని ప్లాస్టిక్  మంటినీటి బాటిల్స్  స్టేడియంలోకి విసిరి కొట్టి  ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆట నిలిచి పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India  South Africa  cricket  Match  South Africa series  Cuttack  Barabati Stadium  

Other Articles