YS Jagan tried six times to do protest

Ys jagan tried six times to do protest

Jagan, Gali, AP, YSRCP, Protest, Special Status, TDP, JaganMohan Reddy

YS Jagan tried six times to do protest. YSRCP President YS Jagan tried to do protest on special status for the state of Ap. TDP Senior leader Gali slams Jagan for his unsucessful protests.

జగన్ ఆరు సార్లు ట్రైచేశారు

Posted: 10/03/2015 07:57 AM IST
Ys jagan tried six times to do protest

వైయస్ జగన్ వైయస్ఆర్ పార్టీ అథినేతగా, ఏపిలో ప్రతిపక్షనేతగా ఉంటున్నా కానీ ఆరు సార్లు ఒకే పనిని చేద్దామని విఫలమవుతున్నారు. అయితే సొంత పార్టీ నేతలో లేదంటే వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగా అధికార పక్షానికి చెందిన నేతలు తెగ బాధపడుతున్నారు. జగన్ పాపం ఎన్ని సార్లు ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారని చింతిస్తున్నారు. అందునా సీనియర్ నేత గాలి మద్దు కృష్ణమ నాయుడు అయితే తెగ బాధపడిపోతున్నారు. అయితే జగన్ ఎందుకు అలా విఫలమవుతున్నారో కూడా తనకు తెలుసునని అంటున్నారు. అసలు జగన్ ఏం చేద్దామనుకున్నారు...? గాలికి అసలు మ్యాటర్ ఏం తెలుసో..? తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

వైయస్ జగన్... ఏపి, తెలంగాణల్లో ఎప్పుడు అవకాశం వచ్చినా వెంటనే ప్రజల మధ్య వాలిపోయి.. ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రల పేరుతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నేత. అయితే గత కొంత కాలంగా జగన్ కాస్త రెస్ట్ రీసుకుంటున్నారు. జగన్ బాధ్యతను షర్మిల పరామర్శల యాత్రల పేరుతో కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికి వైయస్ జగన్ ఏపికి ప్రత్యేక హోదా మీద ఆరు సార్లు దీక్ష చేద్దామని అనుకున్నా.. అది మాత్రం కుదరరలేదని గాలి ముద్దు కృష్ణమ అంటున్నారు. అసలు జగన్ కే అసలు మ్యాటర్ అర్థం కావడం లేదని. తానే డైలమాలో ఉన్నారని గాలి స్పష్టం చేశారు. మొత్తానికి జగన్ నిజంగా ఆరు సార్లు దీక్ష చేద్దామని అనుకున్నా.. రకరకాల కారణాల వల్ల అవి వాయిదా పడుతూనే ఉన్నాయి. మరి గాలి గారి సలహా మేరకు ఈ సారైనా దీక్ష పక్కాగా చేస్తారొ చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Gali  AP  YSRCP  Protest  Special Status  TDP  JaganMohan Reddy  

Other Articles