Naidu have good times

Narachandrababu naidu have good times

Chandrababu Naidu, TDP, AP, TRS, KCR, Telangana, TTDP, Telangana TDP

Narachandrababu Naidu have good times. TDP Party president Nara chandrababu Naidu hope good times for his party. He slams on Telangana cm KCR

చంద్రబాబుకు అన్నీ మంచి శకునములే

Posted: 10/03/2015 07:40 AM IST
Narachandrababu naidu have good times

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు భవిష్యతు అదిరిపొనుంది.. తెలంగాణలో మన పార్టీ మినహా మరో పార్టీకి పెద్దగా స్కోప్ లేదు అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫీలవుతున్నారు. అందుకే తెలంగాణ తెలుగుదేశం నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చేలా దైర్య వచనాలు చెబుతున్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి నూకలు చెల్లాయని.. రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని భరొసా ఇస్తున్నారు. గత కొంత కాలంగా ఏపి పరిపాలనా వ్యవహారాల మీద పూర్తి స్థాయి దృష్టిసారించిన చంద్రబాబు నాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీ తెలంగాణ మీద దృష్టిసారించారు. అయితే రానున్న జిహచ్ఎంసీ ఎలక్షన్ ల నేపథ్యంలో పార్టీని వ్యవస్థాగతంగా పునర్నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. తెలంగాణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే పూర్తి స్థాయి భరోసా ఇస్తోందనే నమ్మకాన్ని తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని, రైతులకు రుణమాఫీలు చెయ్యడంలొ, వారి ఆత్మహత్యలను అడ్డుకోవడంలో కూడా పూర్తిగా వెనుకబడ్డారని, ప్రజల్లో ఉన్న పూర్తి నిస్పృహను తెలిపేలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  TDP  AP  TRS  KCR  Telangana  TTDP  Telangana TDP  

Other Articles