One murder and one murder attemp with single knife

One murder and one murder attemp with single knife

Hyderabad, Murder, Chandrayan Gutta, Crime

One murder and one murder attemp with single knife. In Hyderabad, Chandrayangutta, two youngsters attacked on each other.

ITEMVIDEOS: ఒక కత్తి రెండు మర్డర్ లు

Posted: 10/03/2015 09:23 AM IST
One murder and one murder attemp with single knife

కత్తి పట్టిన వాడు కత్తికే బలికాక తప్పదు.. అని ఓ నానుడి ఉంది. ఎంత వాడు కానీ వాడికి తగిని శిక్షను అనుభవించకతప్పదు. అయితే సినిమాల్లొగా హైదరాబాద్ లో క్రైమ్ సీన్ లు కొత్త కొత్త ట్విస్టులు పులముకుంటున్నాయి. ఒకరిని మర్డర్ చేద్దామని అనుకుంటే... అదే కత్తితో మరొకరి మర్డర్ జరిగిన దారుణం హైదరబాద్ మహా నగరంలో చోటుచేసుకుంది. యువకుల మధ్య తలెత్తిన చిన్న డబ్బుల వ్యవహారం చిలికిచిలికి గాలి వానగా మారింది. మాటా మాటా పెరిగి చివరకు మర్డర్ దాకా చేరింది. గతంలో పాత బస్తీలో యువకుల మధ్య తలెత్తిన ముష్టియుద్దాలు వారి ప్రాణాలను తీసినట్లుగానే తాజాగా చంద్రయాణ్ గుట్టలో అదే సీన్ రిపీట్ అయింది. మాట్లాడుకున్నంత ఈజీగా మర్డర్ చేస్తుండటం పోలీసులకు చెమటలుపట్టిస్తోంది.

హైదరాబాద్ చంద్రయాన్ గుట్టకు చెందిన ముగ్గురు యువకుల మధ్య డబ్బుల విషయంలో తేడా వచ్చింది. దాంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని అలీ అఫారి అనే యువకుడు అడిగాడు. అయితే అలా మాట్లాడుతుండగా మాటలు మితిమీరడంతో అలీ అఫారీ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇబ్రహీం మీదకు దాడికి దిగాడు. వీపులో కత్తితో దాడి చెయ్యగా... వెంటనే తేరుకున్న ఇబ్రహీం అదే కత్తితో తన స్నేహితుడు అలీ అఫారీని దారుణంగా మర్డర్ చేశాడు. దాంతో తాను దాడి చేద్దామనుకున్న కత్తికే అలీ అఫారీ బలైపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Murder  Chandrayan Gutta  Crime  

Other Articles