Madhurai Busses Bomb Blasts Creates Controversy | 2002 Imam Ali Encounter Case | Mumbai Local Train Bomb Blast Incident

Madhurai bus bomb incident 2002 imam ali encounter mumbai local train bomb blast

madhurai bomb blast, madhurai busses bomb blast, chennai busses bomb blast, madhurai incident, madhurai controversy, madhurai bomb blast incident, 2002 Imam Ali Encounter, 2002 Imam Ali Encounter incident, Mumbai Local Train Bomb Blast

Madhurai Bus Bomb Incident 2002 Imam Ali Encounter Mumbai Local Train Bomb Blast : Madhurai Busses Bomb Blasts Creates Controversy.

చెన్నై బస్సుల్లో భారీ పేలుళ్లు.. 2002 ఘటనకు లింకుందా?

Posted: 10/02/2015 11:28 AM IST
Madhurai bus bomb incident 2002 imam ali encounter mumbai local train bomb blast

అప్పటివరకు ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా వుంది.. ఓవైపు వరుసగా బస్సులు నిలబడి వున్నాయి.. మరోవైపు జనాలు కాసేపు సేద తీరుతున్నారు.. ఇంతలోనే భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రదేశంలో నిలబడి వున్న రెండు ప్రభుత్వ బస్సులు భీకర శబ్దంతో భారీ పేలుళ్లకు గురయ్యాయి. పేలుళ్ల ధాటికి బస్సు ముక్కలు దూరంలో ఎగిరిపడ్డాయి. అయితే.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో అక్కడున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మధురైలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధురై ఆరప్పాలయం బస్‌స్టేషన్ మార్గంలో వైగై నది ఒడ్డున నీటి తొట్టి ఉంది. మదురై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాత్రివేళల్లో ఈ నీటి తొట్టె పక్కనే ఉన్న సర్వీసు రోడ్డులో నిలపడం అలవాటు. యథాప్రకారం బుధవారం రాత్రి సైతం అనేక బస్సులు ఈ సర్వీసు రోడ్డులో నిలిచి ఉన్నాయి. సేలం, హోసూరుల నుంచి అదే సర్వీసు రోడ్డులో నిలిపి ఉన్న రెండు ప్రభుత్వ బస్సుల నుంచి రాత్రి 9.15, 9.20  గంటలకు భీకర శబ్దంతో వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి బస్సు ముక్కలు దూరంలో ఎగిరిపడ్డాయి. అయితే.. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పేలుడు సమయానికి సరిగ్గా 15 నిమిషాలకు ముందు హెల్మెట్ ధరించిన నలుగురు యువకులు రెండు బస్సుల్లో టైంబాంబ్‌ను అమర్చి సర్వీసు రోడ్డులోని చీకట్లో జారుకున్నట్లు గుర్తించారు.

ఈ విధంగా ఆ ప్రదేశంలో పేలుళ్లు జరగడం మొదటిసారి కాదు.. గతంలోనూ చోటు చేసుకున్నాయి. పైగా.. ఇదివరకే మదురైలో సంభవించిన పేలుళ్లకు ఉపయోగించిన మందుగుండు సామగ్రినే ఈ పేలుళ్లకు వినియోగించినట్లు తేలింది. దీంతో.. ఈ బాంబు పేలుళ్లకు 2002లో జరిగిన సంఘటనకు లింకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2002 సెప్టెంబర్ 9వ తేదీన మదురైకి చెందిన ఇమాంఅలి, అతని సహచరులను పోలీసులు బెంగళూరులో ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. ఆ ఏడాది నుంచి ఇంచుమించుగా అదే రోజుల్లో మదురైలో ఏదో ఒక పేలుళ్ళ ఘటన చోటు చేసుకుంటోంది. ఈ కోవలో 30వ తేదీన పేలుళ్లకు పాల్పడడంతో ఇది ఇమాంఅలి ముఠా పనేనని అనుమానిస్తున్నారు. మరోవైపు.. ముంబయి లోకల్  రైళ్లలో పేలుడు కేసులో ఐదుగురు ఉరిశిక్ష పడినందుకు నిరసనగా బాంబులు పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles