A Generator Operator Nagaraju Has Revealed Finance Department Corruption On His Facebook Page | Hindupur Finance Department Corruption

Nagaraju facebook revealed hindupur finance department corruption details acto habib

facebook updates, hindupur finance department corruption, finance department acto habib corruption, hindupur corruption case, nagaraju facebook, facebook corruption controversy

Nagaraju Facebook Revealed Hindupur Finance Department Corruption Details ACTO Habib : A Generator Operator Nagaraju Has Revealed Finance Department Corruption On His Facebook Page.

అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన ‘Facebook’

Posted: 10/02/2015 11:03 AM IST
Nagaraju facebook revealed hindupur finance department corruption details acto habib

ఫేస్ బుక్.. ప్రస్తుత ఆధునిక యుగంలో అత్యవసరమైన సామాజిక మాధ్యమం. సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’తో సమానంగా పోటీపడుతున్న ఈ ఫేస్ బుక్.. కేవలం టైంపాస్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఉపయోగపడే ఈ సామాజిక మాధ్యమం.. ఎంతో విలువైన సమాచారాల్ని సైతం ప్రభుత్వానికి అందించడంలో సహాయపడుతోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటననే తీసుకోవచ్చు. ఇటీవల ఓ ప్రభుత్వ విభాగంలో జరిగిన అవినీతి బాగోతాన్ని ఈ ఫేస్ బుక్ బట్టబయలు చేసి, పోలీసుల విచారణకు సహకరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా హిందూపురంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో గుట్టరట్టుకాకుండా గతకొన్నాళ్ల నుంచి అవినీతి జరుగుతూ వస్తోంది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న వారు లంచాలు భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ అవినీతి బాగోతాన్ని బట్టయలు చేయడంలో కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య శాఖకు చెందిన నాగరాజు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో ఈ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) హబీబ్ లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారంటూ నాగరాజు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రైవేట్ బాయ్స్ నుంచి టాక్స్ ఆఫీసర్ దాకా ఎంత లంచాలు వసూలుచేస్తున్నారనే విషయాల్ని విశ్లేషించాడు. దాంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అలజడి చెలరేగింది.

ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, స్పెషల్ వింగ్ స్టాఫ్, ప్రైవేటు బాయ్స్‌తో ప్రతి నెలా ఒక్కొక్క షాపు నుంచి రూ.3 వేలు మొదలుకుని రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వసూళ్ల చిట్టాను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఏసీటీవో రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఐరన్, సిమెంట్ షాపుల నుంచి రూ.20 వేలు, ఫైర్ వర్క్ డీలర్స్ నుంచి రూ.30వేలు, హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ నుంచి రూ.50 వేలు, తూమకుంట, గోళాపురం ఐరన్ ఫ్యాక్టరీల నుంచి రూ.లక్ష, సోప్స్ వ్యాపారుల నుంచి రూ.25 వేలు, ముద్దిరెడ్డిపల్లి పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.లక్ష, బెంగళూరు పార్సిల్ సర్వీసు నుంచి రూ.50 వేల చొప్పున.. ఇలా ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ చిట్టా ఉంచారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలావుండగా.. తూమకుంట చెక్‌పోస్టులో జనరేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఈ వివరాలు ఫేస్‌బుక్‌లో ఉంచి తన ప్రతిష్ఠకు భంగం కల్గించారని ఏసీటీవో హబీబ్ హిందూపురం రూరల్ ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కేసు నమోదు చేస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని, ఫేస్‌బుక్‌లో ఉంచిన అక్రమ వసూళ్ల వివరాలపైనా ఆరా తీస్తున్నామని ఎస్సై తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : facebook corruption  hindupur finance corruption case  

Other Articles