high court order ap telangana govt to file counter on farmer suicides

Court seeks reports from telangana andhra on farmers suicides

High Court seeks reports on farmers' suicides, High Court serious on farmers' suicides, high court serious on Telangana, Andhra Governments, Vyavasaya Jana Chaitanya Samithi pil on farmers suicide, farmer suicides, high court, jana vignana vedika

Taking a serious view of spate of suicides by farmers in Telangana and Andhra Pradesh, the Hyderabad High Court on Tuesday asked both the state governments to submit detailed reports in two weeks.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ రాష్ట్రోన్నత న్యాయస్థానం

Posted: 09/29/2015 10:00 PM IST
Court seeks reports from telangana andhra on farmers suicides

రైతుల ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల రాష్ట్రోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించకుండా, పరిహారం ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి కారణాలు అన్వేషిస్తారని.. కానీ ఇలాంటి సందర్భాల్లో కాదని వ్యాఖ్యానించింది.

దేశానికి వెన్నుముక్క అయిన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడింది. వర్షాభావ పరిస్థితులు రైతు ఆత్మహత్యలకు కారణాలు కాదని, వీటిపై లోతుగా అద్యయనం చేయాల్సిన అవసరముందుని న్యాయస్థానం సూచించింది. రైతు ఆత్మహత్యలపై జనవిజ్ఞాన వేదిక దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmer suicides  high court  jana vignana vedika  

Other Articles