chain snatchers attack women at various places in hyderabad

Chain snatchers create panic in hyderabad

Chain snatchers, hulchul, hyderabad city, chain snacthes create panic in hyderabad, chain snatchers attacks on lone woman, woman gold ornaments, assembly monsoon session, police busy at assembly, inter state dacoits, old criminals, easy money

women scared to come out on roads in hyderabad due to chain snacthing incidents that are rocking in hyderabad, On Tuesday chain snatchers attacked on women at 10 different places in hyderabad

నగరంపై తెగబడిన చైన్ స్నాచర్లు.. ఒకే రోజు పది చోట్ల.. 30 తులాల అభరణాల స్నాచింగ్

Posted: 09/29/2015 07:02 PM IST
Chain snatchers create panic in hyderabad

బాగ్యనగరంగా బాసిల్లుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజుకో రకంగా మోసం చేసే మాయగాళ్లకు కొదవలేకుండా పోయింది. కొత్త కొత్త పంథాలో దోపిడీలు, దోంగతనాలు చేసి.. ఈజీ మనీ కోసం ఎగబడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం.. అందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రత కల్పించడంతో.. ఇక రోడ్లపైన పోలీసులు తక్కువ సంఖ్యలోనే గస్తి వుంటున్నారని భావించారో ఏమో తెలియదు కానీ మంగళవారం ఒక్కటే రోజున చైన్ స్నాచింగ్ ముఠాలు నగరంపై తెగబడ్డారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ ధరించి వేగంగా వచ్చి... రోడ్డుపై నడుచుకుని వెళుతున్న మహిళల మెడలోని నగలు క్షణాల్లో లాక్కొని పరారవుతున్నారు.

తాజాగా దుండగులు మంగళవారం ఒక్కరోజే పదికి పైగా బంగారు గొలుసుల చోరీలకు పాల్పడ్డారు. కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లోని ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా చేసుకుని... తమ ప్రతాపాన్ని చూపించారు. మహిళలు ఒంటరిగా కనిపించటమే ఆలస్యం... వారు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కూకట్‌పల్లిలోని ధర్మారెడ్డికాలనీ, వివేకానందా నగర్‌లోని రెండు ఘటనల్లో ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు. ఇక సనత్‌నగర్‌, ఎస్ఆర్ నగర్‌, ఫిల్మ్‌నగర్‌, దోమలగూడా, అశోక్‌నగర్‌లలో 21 తులాల బంగారాన్ని తెంచుకు వెళ్లారు.  అంతర్‌ రాష్ట్ర ముఠాలకు చెందిన పాతనేరస్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో మహిళలు రోడ్లపైకి రావడానికి వణికిపోతున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain snatchers  hulchul  hyderabad city  

Other Articles