Man gets iron locket instead of cellphone

Online shopping fraud

online marketing, online marketing fraud, online shopping fraud, online offers, Offer, Online, Cellphone, Iron Locket, anantapur gutty , online shopping mistakes

An anatapur person from gutty, books for a cellphone on online marketing, but he is shocked to see iron locket in the parcel he bought

అయ్యో.. రామా..! సెల్ ఫోన్ కోసం వెళ్తే.. శఠగోపం పెట్టారు..

Posted: 09/29/2015 10:03 PM IST
Online shopping fraud

మంచి ఆఫర్ వచ్చిందని సంబరపడ్డాడు. వెంటనే ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ బుక్ చేశాడు. తనకు వచ్చిన పార్శిల్ చూసి అవ్వాకయ్యాడు. తనకు పోస్టులో వచ్చింది తాను బుక్ చేసిన సెల్‌ఫోన్‌ కాదు. మరేంటి అంటున్నారా..? ఐరన్ లాకెట్ . ఇది చూసి నివ్వెరపోవడం అతగాడి వంతైంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెండావీధికి చెందిన మహ్మద్ హుసేన్ అలియాస్ డాన్స్ గోరాకు ఈనెల 23న ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో తాము ఢిల్లీ ప్రథమరత్న ఆస్ట్రాలాజికల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని సామ్‌సంగ్ గ్రాండ్ మొబైల్ భారీ ఆఫర్ ఉందన్నారు. మొబైల్ అసలు రేటు రూ.8,400 అని అయితే ఆఫర్ డిస్కౌంట్ పోను కేవలం రూ.3,000కే ఇస్తామని చెప్పారు.

ఇప్పుడే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని పోస్టులో వచ్చాక పోస్టల్ అధికారులకే బిల్లు (డబ్బు) చెల్లించాలని చెప్పా రు. ఆశపడిన గోరా  క్షణం కూడా ఆలోచించకుండా మొబైల్‌ను బుక్ చేశాడు. సోమవారం పోస్టల్ అధికారులు మీకు పార్సిల్ వచ్చిందని తీసుకెళ్లాలని గోరాకు ఫోన్ చేశారు. గోరా పోస్టాఫీసులో రూ.3 వేలు చెల్లించి పార్సిల్ బాక్స్‌ను తీసుకున్నాడు. అక్కడే బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగా ఐరన్ లాకెట్ ఉంది. ఒక్క సారిగా తెల్లమొఖం వేసిన గోరా తనకు వచ్చిన సెల్‌ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్‌లో ఉంది. దీంతో ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా వుండాలని.. తిమ్మిని బమ్మిని చేసే తిమింగళాలు ప్రజల సోమ్మను అప్పనంగా మేయడానికి కాచుకు కూర్చున్నాయని గ్రహించాల్సిందిగా సూచిస్తున్నాం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Offer  Online  Cellphone  Iron Locket  

Other Articles