NDA, Lalu-Nitish alliances neck and neck: India TV-CVoter survey

Nda grand alliances neck and neck in bihar india tv cvoter survey

bihar assembly election 2015, NDA, Grand allaince, opinion polls, RJD, JDU, Congress, bihar polls, opinion polls, latest survey, India TV-CVoter survey, National Democratic Alliance, Chief Minister Nitish Kumar, India, Lalu Prasad, Bihar, Bjp, Congress

The BJP-led NDA and the grand alliance of JD-U, RJD and Congress are running neck and neck in the Bihar assembly elections, according to projections by opinion polls

అ రెండు కూటముల మధ్య పోరు రసవత్తరం.. ఉత్కంఠభరితం

Posted: 09/25/2015 05:04 PM IST
Nda grand alliances neck and neck in bihar india tv cvoter survey

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలలో ప్రస్తుతానికి రెండు కూటముల మధ్య బలాబాలాలు సమాన స్థాయిలోనే వున్నాయని తాజా సర్వేలలో వెల్లడైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే ఎన్డీయేకు 117 సీట్లు, మహాకూటమికి 112 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రెండుపక్షాల మధ్య ఓట్లలో ఒక శాత మే తేడా ఉందని తెలిపింది. ఎన్డీయేకు 43 శాతం, మహా కూటమికి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు, స్వతంత్రులు 14 సీట్లు గెలుస్తారని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది.

బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7,786 మంది శాంపిల్స్‌ను ఈసర్వే తీసుకుంది. వీరిలో 46.8 శాతం మంది నితీష్ కుమారే మళ్లీ సీఎం కావాలను కుంటున్నట్లు చెప్పారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించనప్పటికీ, బీజేపీ నేత సుశీల్ మోదీకి 16 శాతం మంది సీఎంగా పట్టం కట్టారు. 6.7 శాతం మాంఝీని కోరుకోగా, షానవాజ్ హుస్సేన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 5.4 శాతం మంది చెప్పారు. అలాగే ఇండియా టీవీ-సీఓటర్ సర్వే... ఎన్డీయేకు 109-125 సీట్లు, మహా కూటమి 104-120 వస్తాయని అంచనా వేసింది. దీంతో బిహార్ ఎన్నికలలో పోరు రసవత్తరంగా, ఉత్కంఠ భరితంగా మారింది. ఐదు విడతలుగా జరగనున్న ఎన్నికలలో ఎ వరిపై ఎవరు పైచేయి సాధిస్తారోన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే జరిగితే.. మరోమారు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుందా..?  స్వతంత్రుల మద్దతుతో ఎవరు గద్దెనెక్కుతారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar assembly election 2015  NDA  Grand allaince  opinion polls  

Other Articles