No tenders for some liquor shops in Telangana Liquor tenders

No tenders for some liquor shops in telangana liquor tenders

Excise, Tenders, Telangana, Liquor

No tenders for some liquor shops in Telangana Liquor tenders. From today excise department will verify the tenders and announce the lucky winners.

మందు షాపుల్లో కొన్నింటికి ఫుల్... మరికొన్నింటికి నిల్

Posted: 09/23/2015 08:37 AM IST
No tenders for some liquor shops in telangana liquor tenders

మద్యం దుకాణాలకు దరఖాస్తుల అంకం ముగిసింది. దరఖాస్తుల ఆదాయం, సంఖ్య భారీగానే పెరిగినప్పటికీ కార్పొరేషన్ల పరిధిలో ఇంకా 105 దుకాణాలకు ఒక్క ఆర్జీ కూడా దాఖలు కాకపోవడం విశేషం. సుమారు నాలుగు నెలలపాటు భారీ కసరత్తు చేసి రూపొందించిన నూతన మద్యం పాలసీలో కూడా దరఖాస్తులకు నోచని దుకాణాలు నమోదు కావడం విశేషం. ఈనెల 14నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2216 దుకాణాలకుగానూ 2111 మద్యం దుకాణాలకు వ్యాపారస్తులనుంచి స్పందన వచ్చింది.

వీటికిగానూ 30,987 దరఖాస్తులు దాఖలు కావడంద్వారా  154.94 కోట్ల దరఖాస్తు ఆదాయం సమకూరింది. గతేడాదికంటే దరఖాస్తులు 30 శాతం వృద్ధి చెంది 30వేలకు చేరాయి. గతేడాది 21,756 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 30,987 దరఖాస్తులు రావండతో ఆబ్కారీ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. గతేడాది దరఖాస్త్త్‌ు రుసుముల రూపంలో ఏడాదికి 53.56 కోట్ల రాబడి ఖజానాకు చేరగా తాజాగా రెండేళ్ల పాలసీలో ఇది 200 శాతం వృద్ధిరేటుతో  154.94 కోట్లకు చేరింది. మిగిలిపోయిన మద్యం దుకాణాలకు బుధవారం నిర్వహించనున్న లాటరీల తర్వాత రీ నోటిఫిికేషన్‌ ద్వారా దరఖాస్త్‌ులను ఆహ్వానించనున్నారు. ఇందుకుగానూ రీ లొకేషన్‌కు అనుమతించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఫలితంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు షాపుల అనుమతింపుతో దరఖాస్తులు వస్తాnయని అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 105 దుకాణాలకు ఒక్క దరఖాస్త్తు కూడా రాలేదు. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో 52 ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 25, దూల్‌పేట్‌లో 8, రంగారెడ్డిలో 32 ఉండా వీటిలో సరూర్‌నగర్‌లో 27, మేడ్చేల్‌లో 5 దుకాణాలు ఉన్నాయి. వరంగల్‌లో 5, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల్‌లో 2, నిజామాబాద్‌లో 5, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో 5 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. మెదక్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లఓ కొన్ని ప్రాంతాలె కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలోకి చేరడంతో దరఖాస్తులు రాలేదు. పెరిగిన లైసెన్సు రుసుములు ఇందుకు ఆటంకంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Excise  Tenders  Telangana  Liquor  

Other Articles