Telangana assembly session commence from today

Telangana assembly session commence from today

TRS, Telangana, Assembly, KCR, Revanth Reddy, farmers, Suicides

Telangana assembly session commence from today. Telangana cm KCR instructed his cader to counter to opposition parties.

నేటి నుండి అసెంబ్లీలో సమరమే..

Posted: 09/23/2015 08:30 AM IST
Telangana assembly session commence from today

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్నటి పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతలకు తగిన సూచనలు, సలహాలు అందించారు. సమావేశాల్లో అవలంబించాల్సిన ధోరణి, ప్రతిపక్షాలకు ధీటుగా ఎదురుకునేందుకు తగిన దిశానిర్దేశం  చేశారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల మీద విపక్షాలు అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలతో సభలో ముప్పేద ఎదురుదాడికి సిద్దంగా ఉండాలని కేసీఆర్ సూచించారట. గణాంకాలతో వివరించి సహా సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చెయ్యాలని అన్ని శాఖల మంత్రులకు కేసీఆర్ హుకుం జారీ చేశారు. తాజాగా చైనా పర్యటనతో సహా అన్నింటి మీద సభలో వివరించాలని.. ప్రతిపక్షాలు సహేతుక చర్చకు అవకాశం ఇస్తే ఎంతవరకైనా కానీ సభను కొనసాగిస్తామని కేసీఆర్ వెల్లడించారు.  

మరో పక్క ప్రతిపక్షాలు అధికార పక్షం మీద అన్ని రకాలుగా దాడికి సిద్దంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టులు, ఉద్యోగాల ప్రకటన, కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో సహా పలు కీలక అంశాల మీద అధికార పక్షానికి చెమటలు పట్టించాలని సిద్దమవుతున్నాయి. కాగా గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మాదిరిగానే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే సభ్యలను సభలోనుండి వెళ్లగొట్టేందుకు అన్ని రకాల ఏర్సాట్లు చేసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి లాంటి టిడిపి నాయకులు సభలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పితే సభలో ఎలాంటి చర్యలకైనా స్పీకర్ , అటు ప్రభు్తంవ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సామావేశాలు ప్రజా సమస్యలను ఎంత వరకు చర్చకు తీసుకువస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana  Assembly  KCR  Revanth Reddy  farmers  Suicides  

Other Articles