Finally Highcourt Has Dismissed The Road Show Case On Chiranjeevi | Prajarajyam Party Controversy | Chiranjeevi Updates

Highcourt dismissed road show case on chiranjeevi

chiranjeevi, megastar chiranjeevi, high court chiranjeevi, chiranjeevi road show case, chiranjeevi photos, chiranjeevi kurnool case, chiranjeevi prajarajyam party, high court photos

Highcourt Dismissed Road Show Case On Chiranjeevi : Finally Former Central Minister Chiranjeevi Gets Free From Road Show And In Other Case. HighCourt Dismissed Those Cases.

ఎట్టకేలకు చిరంజీవికి ఆ రెండు కేసుల నుంచి ఊరట!

Posted: 09/23/2015 10:38 AM IST
Highcourt dismissed road show case on chiranjeevi

మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఎట్టకేలకు రెండు కేసుల నుంచి బయటపడ్డారు. గతకొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న ఆ కేసుల్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో చిరు కాస్త రిలాక్స్ గా ఫీలయ్యారని సమాచారం. ఇంతకీ ఆ కేసులేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే! ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో వున్నప్పుడు ఆయన తన పార్టీని ప్రచారం చేసే నేపథ్యంలో 2009 ఫిబ్రవరి 19వ తేదీన కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో విస్తృతంగా రోడ్ షో నిర్వహించారు. అయితే.. ఈ రోడ్ షో కారణంగా సాధారణ ప్రజానీకానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో.. చిరంజీవి నిర్వహించిన రోడ్ షో వల్ల సాధారణ ప్రజలకు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలు చేస్తూ ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. ఈ విధంగా తనపై నమోదైన కేసుల్లో నంద్యాల కోర్టులోని విచారణను కొట్టివేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. మరో కేసుకు సంబంధించి కోయిలకుంట్ల జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణను సైతం కొట్టేయాలని చిరు కోరారు.

చిరు వ్యాజ్యాలను పరిశీలించిన హైకోర్టు.. రెండు కేసుల్లో విచారణలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి తీర్పు వెల్లడించారు. ఈ వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపస్తూ.. స్వతంత్ర వ్యక్తి కాకుండా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయన చెప్పిన వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. నంద్యాల, కోయిలకుంట్ల కోర్టుల్లోని పిటిషనర్ కు సంబంధించిన కేసుల్లో విచారణలను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi road show  telugu states high court  

Other Articles