PM Modi Now Only Meets People Wearing Suit Boot

Rahul slams modi

Rahul Gandhi , Bihar elections , modi, Attack on Modi, Rahul about Modi

PM Modi Now Only Meets People Wearing Suit Boot says Rahul gandhi. In his first visit to poll-bound Bihar, Congress vice president Rahul Gandhi is addressing an election rally at Hazari Maidan in West Champaran's Ramnagar town.

మళ్లీ సూట్ బూట్ కొట్టిన రాహుల్ గాంధీ

Posted: 09/19/2015 04:31 PM IST
Rahul slams modi

త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంపారన్‌లో రాంనగర్‌లో ఉన్న హజారీ మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వితో కలిసి పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. మోదీ చాయ్‌వాలా అని ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ, చాయ్‌వాలాగా చెప్పుకునే మోదీ సూట్ బూట్ వేసుకునే వాళ్లకే దగ్గరవుతున్నారని విమర్శించారు. మోదీది పేదల సర్కారు కాదని సూట్‌బూట్ సర్కారు అని విమర్శించారు. మోదీ సూట్‌బూట్‌కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మోదీ 15 లక్షల విలువ చేసే సూట్‌ను దరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, ఆయన సూట్‌బూట్ వాలా దోస్తుల నుంచి బీహార్‌ను రక్షిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. చంపారన్ చక్కెర పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని మోదీ చెప్పారు కానీ ఇప్పటి వరకు పరిశ్రమను తెరిపించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని మోదీ మరచిపోయారని దుయ్యబట్టారు. మెదీపై పిట్ట కథలు చెప్పి జనాన్ని ఆకర్శించుకున్నారు. పిట్టకథకు ప్రజలు ఈలలు, చప్పట్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ స్పీచ్ లో హైలెట్స్..
* బట్టలు ఒక మనిషి గురించి చాలా చెబుతాయి.. గాంధీ గారు కనీసం బట్టలు కూడా వేసుకోలేదు.
* అందుకే నేను పార్లమెంట్ లో సూట్ బూట్ కీ సర్కార్ అని ప్రకటించాను.
* లలిత్ మోదీని కాపాడేందుకు సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తున్నారని.. మోదీ మాత్రం ఇప్పటికీ తినను.. తిననివ్వను అని డైలాగ్ లు కొడుతున్నారని అన్నారు.
* బీహార్ ను సూట్ బూట్ సర్కార్ నుండి కాపాడాలనుకుంటున్నాం
* బీహార్ లో అధికారంలోకి వస్తే ఎంప్లాయ్ మెంట్ కల్పిస్తామని రాహుల్ వెల్లడించారు.

//జి. మనోహర్//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Bihar elections  modi  Attack on Modi  Rahul about Modi  

Other Articles