Shuttler Ajay Jayaram outlasts Tien Chen to reach Korea Open final

Ajay jayaram storms into korea open final

Korea Open results,Ajay Jayaram,Ajay Jayaram Reaches Semis,Ajay Jayaram Reaches finals after defeating Chen Long of China, Ajay Jayaram into finals,Ajay Jayaram Korea Open, ajay jayaram badminton, badminton ajay jayaram badminton india, badminton india, korea open, badminton news, sho sasaki, korea open badminton series, japanese player, Viktor Axelsen

Ajay Jayaram dominated the proceedings to eventually set up a summit clash with World No. 1 Chen Long of China.

కొరియా ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్లిన అజయ్ జయరామ్

Posted: 09/19/2015 07:35 PM IST
Ajay jayaram storms into korea open final

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ ధేశం తరపున పోరాడుతన్న ఒకే ఆశాకిరణం.. ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తున్నాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో అంచనాలకు దూరంగా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ మాత్రం ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ.. తన సత్తాను కొనసాగిస్తున్నాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో తొలి రౌండ్ లో విక్టర్ అక్సెల్ సన్ ను ఓడించినప్పటి నుంచి ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. వెనుదిరిగి చూడకుండా ముందుకుదూసుకుపోతున్న జయరామ్ ఫైనల్ కు చేరాడు. నిన్న జరిగిన క్వార్టర్ లో జపాన్ ఆటగాడు షో ససాకీని ఖంగుతినిపించిన జయరామ్.. ఇవాళ జరిగిన సెమీస్ లోనూ చైనా ఆటగాడిని మట్టికరిపించాడు.

శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జయరామ్ 21-19, 21-15 తేడాతో వరల్డ్ ఏడో ర్యాంక్ ఆటగాడు చౌ తెన్ చెన్(చైనీస్ తైపీ) )పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జయరామ్.. చౌ చెన్ ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. కేవలం 43 నిమిషాల వ్యవధిలోనే  జయరామ్ సెమీ ఫైనల్ పోరును ముగించాడు. ప్రస్తుత సీజన్ లో ఇదే ప్రత్యర్థిని జర్మన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లలో బోల్తా కొట్టించిన జయరామ్ అదే ఊపును కొరియన్ ఓపెన్ లో కూడా కొనసాగించాడు. తొలి గేమ్‌లో జయరామ్ 11-8తో ముందంజంలో పయనించినా.. ఆ తరువాత కాస్త వెనుకబడ్డాడు. అయితే ఎట్టకేలకు తొలి సెట్ ను గెలుచుకున్న జయరామ్ ఆధిక్యం సంపాదించాడు.

ఆ తరువాత సెట్ లో తొలుత 3-0 తో జయరామ్ ఆధిక్యం సాధించినా.. తరువాత తేరుకున్న చెన్ వరుస పాయింట్లు సాధించాడు. ఓ దశలో రెండో సెట్ కోసం ఇరువురి మధ్య సాగిన పోరు ఉత్కంఠను రేపింది. జయరామ్ -చెన్ ల స్కోరు 12-12 వద్ద ఉండగా వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కాగా, ఆ తరువాత చెన్ 15-14 తో ముందుకు దూసుకువెళ్లాడు. ఇలా ఇరువురి మధ్య కాసేపు దోబుచులాడిన రెండో సెట్ ను జయరామ్ కైవసం చేసుకుని చెన్ కు చెక్ పెట్టాడు. ఈ తాజా గెలుపుతో జయరామ్ తుదిపోరులో చెన్ లాంగ్ తో తలపడనున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajay jayaram  Chen Long  final  korea open badminton series  

Other Articles