AP people afraid of dogs

Ap people afraid of dogs

AP, People, Dogs, Dogs attack on people, Vishakapatnam, Kadapa

AP people afraid of dogs. From last few days, Dogs attacking on people. In Vishaka, a kid lost his last beath.

ఏపిలో భౌ..భౌల భయం.. జాగ్రత్త

Posted: 09/19/2015 04:30 PM IST
Ap people afraid of dogs

ఏపీలో కుక్కల బెడద ఎక్కువైపోయింది. వీధిలో నడుస్తుంటే ఎక్కడి నుంచి వచ్చి ఏ కుక్క అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.  సిటీనా, విలేజా అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కుక్కకాటుకు విశాఖలో ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోగా, కడప జిల్లా పద్వేలులో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. శునకాలు ఆంధ్రా ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా ఊరకుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. శునకాల దాడులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

పాలకుల నిర్లక్ష్యానికి పసిప్రాణాలు బలవుతున్నాయి. మొన్న గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఓ పసికందును కొరికి చంపేస్తే, నిన్న విశాఖలో కుక్కల బారిన పడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు వదిలాడు. తల్లి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో గేటు తెరిచి ఉండటంతో ఇంటిబయటకు వచ్చిన బాబుపై  కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. శరీరమంతా గాట్లు పెట్టడంతో పాటు.. పొట్టలో పేగులు బయటకు వచ్చేలా కొరికాయి. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాబుని ఆసుపత్రికి తీసుకొళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించాడు. కడప జిల్లా బద్వేలులోనూ వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరియాయి. ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్న చిన్నారులపై భయానక రీతిలో మీదకు దూకి ఎక్కడికక్కడ పీకి పెట్టాయి. చిన్నారులపై కుక్కలు దాడి చేస్తుండగా.. స్థానికులు గమనించి తరిమివేయడంతో పిల్లలు ప్రాణాపాయ స్ధితినుంచి తప్పించుకున్నారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో... స్థానిక ఆసుపత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  People  Dogs  Dogs attack on people  Vishakapatnam  Kadapa  

Other Articles