One More child body found at turkey beach

One more baby dead body found at beach

Kurdish Boy, Baby Boy, Turkey Beach, Syrian, Refugee

One More child body found at turkey beach. In last week, a kurdish baby boy body found at turkey beach, after a gap one more body found at beach.

బీచ్ కు కొట్టుకొచ్చిన మరో చిన్నారి మృతదేహం

Posted: 09/19/2015 11:13 AM IST
One more baby dead body found at beach

తీరంలో అలలతో ఆటలాడాల్సిన చిన్నారి అదే అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఫోటో.... ప్రపంచంలో అందరి చేత కంటతడి పెట్టించింది. ఒకే ఒక్క ఫోటో సమాజంలో అందరి చేత ఆలోచించేలా చేసింది. ఎన్నో దేశాలు సిరియా.. చుట్టుపక్కలి దేశాల నుండి విదేశాలకు వలస వెళుతున్న వారికి ఆశ్రయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాయి. బ్రిటన్ , గ్రీస్ తో సహా చాలా దేశాలు తమ దేశంలోకి శరణార్థులు రావడానికి అవకాశాలు కల్పించాయి. అయితే ఎంతో మంది వలసలవాదులకు ఇది సంతోషం కలిగించినా.. చాలా మంది పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది.

Also Read: మూడు వారాలుగా భర్త శవంతో భార్య

Also Read: సముద్ర తీరంలో చిన్నారి శవం.. బాధాకరం

ఇటీవల టర్కీ బీచ్‌కు కొట్టుకువచ్చిన సిరియా బాలుడు అయిలాన్‌ కుర్దీ మృతదేహం ప్రపంచాన్ని కదిలించింది. ఈ విషాద ఘటన మరువకముంగే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వలస పడవ సముద్రంలో మునిగిపోవడంతో చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృత దేహం పశ్చిమ టర్కీలోని ఓ బీచ్‌కి కొట్టుకొచ్చింది. ఐజ్మిర్‌ రాష్ట్రంలోని ఏజియాన్‌ పట్టణం సముద్రతీరానికి నాలుగేళ్ల బాలిక మృత దేహం కొట్టుకొచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 15మందితో వెళుతున్న వలస పడవ అక్కడి చిసో శాంక్‌ అనే గ్రీకు ద్వీపం సమీపంలో మునిగిపోయింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kurdish Boy  Baby Boy  Turkey Beach  Syrian  Refugee  

Other Articles