Kurdish baby | Syria | Turkey Beach

The tiny child is thought to be part of a group of 11 syrians who drowned off the coastal town of bodrum in turkey

Kurdish baby, Syria, Turkey Beach, Mediterranean, Europe, ISIS, battle in Syria, Kurdish fight

The tiny child is thought to be part of a group of 11 Syrians who drowned off the coastal town of Bodrum in Turkey after an attempt to escape the war ravaged country and cross the Mediterranean to reach the safety of of Europe.

సముద్ర తీరంలో చిన్నారి శవం.. బాధాకరం

Posted: 09/04/2015 11:27 AM IST
The tiny child is thought to be part of a group of 11 syrians who drowned off the coastal town of bodrum in turkey

మానవత్వం మంట కలిసింది.. మనిషి తనానికి మచ్చగా నిలుస్తోంది తాజాగా ఓ ఘటన. ముక్కుపచ్చలారని ఓ చిన్నారి తన తనువు చాలించిన ఘటన ప్రపంచం కంట నీరుపెట్టిస్తోంది. మూడంటే మూడు సంవత్సరాల చిన్నారి సముద్రపు అంచులో.. అలల తాకిడికి కొట్టువచ్చి శవంగా కనిపించిన దారుణం ప్రపంచాన్ని కలిచివేసింది. మానవజాతి అభివృద్ది చెందింది.. అన్నింటా ముందుకు దూసుకువెళుతోంది అని గర్వంగా చెప్పుకునే మనషికి తన విలువలు.. మానవతావాదం కనుచూపు మేరలో కనిపించకుండాపోయింది. అంతరిక్షానికి వెళ్లినా... అందలాలు ఎక్కినా కానీ మానవత్వం మరిచిన నాడు మానవ జీవితానికి సార్థకత ఉండదు. టర్కీ తీరంలో కనిపించిన ఓ చిన్నారి శవం అందరి చేతి కంటతడి పెట్టించింది.


భూమాత ఒడిలో నిదురిస్తున్న ఆ చిన్నారికి అలల శబ్దం వినిపించలేదు.. సముద్రము నీరు తనను తాకడం లేదు.. భూమాత ఒడిలో తన తనువును చాలించిన చిన్నారికి ప్రపంచం మొత్తం కన్నీటి తర్పణం అర్పిస్తోంది. నాన్న రక్షణలో ఎదగాలని, అమ్మ ఒడిలో గోరు ముద్దలు తినాలని.. మనిషి జన్మకు సార్థకత సాధించాలని అనుకున్న ఆ చిన్నారి జీవితం కేవలం మూడంటే మూడు ఏళ్లలో ముగిసిపోయింది. కానీ ఆ పాపంలో అందరి పాత్ర కూడా ఉంది. అవును. మనం అవునన్నా కాదన్నా అది నిజం. చిన్నారి ప్రాణానికి హామీ ఇవ్వలేని మనము, మన టెక్నాలజీ, మన అభివృద్ది ఎందుకూ కొరగానివి.


ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ జాతి.. నీ భూభారతిని అని గురజాడ అన్నారు. అది మన ఒక్క భారతదేశానికి సంబందించినది కాదు. ఏ దేశంలో ఉన్నా ఆ దేశ ప్రజలకు ఈ మాటలు వేదవచనాలు. కానీ మాకు ఈ దేశం వద్దు బాబోయ్ అంటూ దేశాన్ని వారి కన్నవారిని, ఉన్న వారిని వదిలి దేశం కాని దేశానికి ఉన్న పలంగా ప్రయాణమవుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించలేదని దేశం నుండి బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేరే దేశాలకు ఎంతో మంది వలస వాదులు ప్రయాణమవుతున్నారు. అలా తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఎంతో మంది చనిపోతున్నారు. అలా చనిపోయిన వారిలో ఓ మూడు సంవత్సరాల చిన్నారి పేరు అయలాన్ కుర్దీ.


సిరియాలో గత కొంత కాలంగా రక్తపాతం సాగుతోంది. అక్కడి భూమి నీటితో కాకుండా రోజూ రక్తంతో తడుస్తోంది. తన బిడ్డల రక్తాన్ని కళ్లారా చూస్తున్న ఆ భూమాత కంట నీరు పెడుతోంది.. తన బిడ్డలను కాపాడుకునే ప్రత్యామ్నాయం లేక విలవిల ఏడుస్తోంది. అయితే తన బిడ్డలు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటే చాలని..భూమాత అర్థిస్తోంది. అయితే ప్రాణాల కోసం పక్క దేశాలకు వలసవెళ్లే క్రమంలో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. తమకు తెలియకుండానే మృత్యు ముఖానికి చేరువవుతున్నారు. అయితే ఎంతో మంది చనిపోయినా ఒక చిన్నారి చావు మాత్రం ప్రపంచానికి కలచివేస్తోంది.


ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా గత కొంత కాలంగా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో పుట్టినగడ్డను, ఆస్తిపాస్తులను వదిలేసి వేలాది మంది ప్రాణాలకు తెగించి చిన్నచిన్న బోట్లలో మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేస్తున్నారు. జనాన్ని అక్రమంగా తరలించే ముఠాల అత్యాశతో బోట్లు కిక్కిరిసిపోతున్నాయి. కల్లోల సముద్రంలో ఈ బోట్లు మునిగిపోతున్నాయి. వేల మంది చనిపోతున్నారు. భవిష్యత్ మీద ఎంతో ఆశతో, ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్‌కు ప్రయాణమైన ఓ కుటుంబం. ఒక్కరిని మాత్రమే విధి ఒడ్డుకు చేర్చింది. మిగిలిన వారిని మృత్యువు కాటు వేసింది. అయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది.


మానవ జాతి ముఖ చిత్రం మీద మాయని వచ్చగా మారిన కుర్దీ చిన్నారి మృతి అందరికి కలిచివేసిది. అంతర్జాతీయ సమాజంలో దీని మీద ఆందోళన వ్యక్తమైంది. మానవత్వం మంటకలిసింది అని చెప్పడానికి తాజాగా ఇదే నిదర్శనం అంటూ కొంత మంది పెదవి విరిస్తే.. కొంత మంది మాత్రం తమ బాధను కన్నీటి ద్వారా వ్యక్తం చేశారు.  ఎందరో సోషల్ మీడియాలో చిన్నారి మృతి మీద నివాళి అర్పించారు. మతం మాటున జరగుతున్న సిరియా యుద్దానికి చరమ గీతం పాడాల్సిన అవసం ఉంది. అక్కడ చనిపోతున్న వేల చిన్నారుల తల్లల కన్నీటిని తుడిచే ప్రయత్నం చెయ్యాలి. మరోసారి ఏ చిన్నారి, ఏ తల్లి తన కొడుకు గురించి కన్నీరు పెట్టకూడదని మనసారా కోరుకుంటున్నాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kurdish baby  Syria  Turkey Beach  Mediterranean  Europe  ISIS  battle in Syria  Kurdish fight  

Other Articles