Srisailam dam got beauty with full water

Srisailam dam got beauty with full water

Srisailam, Dam, Water, Heavy Rains, Karnataka, Maharastra

Srisailam dam got beauty with full water. By the Heavy rains in the Karnataka and maharastra, srisailam Dam got sufficient water.

శ్రీశైలం డ్యాంకు జలకళ

Posted: 09/19/2015 08:29 AM IST
Srisailam dam got beauty with full water

కృష్ణానది పరివాహకంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి నీటిప్రవాహం నిలకడగా కొనసాగుతూ వస్తోంది. శుక్రవారం జలాశయం లోకి ఇన్‌ఫ్లో 40,822 క్యూసెక్కులు ఉండగా, నీటిమట్టం 838.80 అడుగులకు చేరుకుంది. నీటినిలువ 60 టీఎంసీలకు పెరిగినట్టు జలవన రుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షా కాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జలా శయంలోకి ఎగువ నుంచి 36టీఎంసీల నీరు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 854అడుగులుగా ఉంది. నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకోవాలంటే మరో 16అడుగులు పెరగాల్సి వుంది. జలాశయంలో నీటిమట్టం ఈ స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి శ్రీశైలం కుడిప్రధాన కాలువకు నీటివిడుదల సాధ్యపడుతుంది.

రాయలసీమ ప్రాంతం ప్రజల నుంచి ఇప్పటికే శ్రీశైలం నీటికోసం డిమాండ్లు అధికమవుతున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854అడుగుల స్థాయికి చేరుకునేదాక ప్రాజెక్టు నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని దిగువకు విడుదల చేయరాదని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్న గ్రామాల తాగునీటి అవసరాలకోసం శ్రీశైలం నుంచి నాలుగు రోజులుగా నీటివిడుదల జరుగుతోంది. శుక్రవారం కూడా జలాశయం నుంచి 5055 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహకంగా ఎగువన కర్నాటకలో ప్రాజెక్టుల్లోకి నీటిచేరికలు తగ్గుతున్నాయి. ఆల్మట్టి జలాశయంలోకి 10209 క్యూసెక్కుల నీరు మాత్రమే ఎగువ నుంచి చేరుతోంది. దిగువన నారాయణపూర్‌ జలాశయంలోకి కూడా ఇన్‌ఫ్లో 5600క్యూసెక్కులు మించటం లేదు. జూరాల వద్ద ఇన్‌ఫ్లో 14,717క్యూసెక్కులు ఉండగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం పవర్‌హౌస్‌ ద్వారా 13,816 క్యూసెక్కుల నీరు నదిలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కృష్ణాకు ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్రలో కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించటం లేదు. ఎగువ నుంచి జలాశయంలోకి కేవలం 2872 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంటోంది. రోజా వద్ద నదిలో నీటిప్రవాహం 30,800 క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srisailam  Dam  Water  Heavy Rains  Karnataka  Maharastra  

Other Articles