Ahmedabad: Cousins tie the knot accidentally, seek police help for divorce

First cousins in ahmedabad tie the knot accidentally

bizarre incident in Ahmedabad, lovers turns brother and sister, Ahmedabad woman's police station, sister married first cousin by mistake, cousin marriage, ahmedabad, cousins tie the knot, divorce, gujarat, marriage, women’s police station in city, tie the knot, cousin

In a bizarre incident in Ahmedabad, a woman has approached a woman's police station, seeking help to get her a divorce as she had married her own first cousin by mistake.

అన్నా చెల్లెళ్ల ప్రేమ వివాహం.. నిజం తెలిసి విడాకుల పర్వం..

Posted: 09/16/2015 06:22 PM IST
First cousins in ahmedabad tie the knot accidentally

వివాహాలు స్వర్గంలో నిశ్చయమౌతాని అంటుటారు పెద్దలు. మరికోందరు మీకు ఎవరు భాగస్వామిగా రావాలన్నది బ్రహ్మ అప్పుడే రాసి పెడతాడని అంటుంటారు. కానీ ఇక్కడ జరిగిన ఓ పెళ్లి మాత్రం.. వాటిని భద్దవిరుద్దంగా జరిగింది. అయితే ఈ పెళ్లి బ్రహ్మ బదులు ఎవరో రచించారా..? అన్న ప్రశ్నలకు ఊతమిస్తుంది. ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.. ఆమెకు వరుసకు సోదరుడవుతాడని తెలుసుకుని నిశ్చేష్టురాలైయ్యింది. తాము బంధువులమని తెలియక ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. తన భర్తే ...వరుసకు సోదరుడని పెళ్లయిన తర్వాత నిజం తెలుసుకున్న ఆ యువతి విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్లో ఇటీవల ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.

అంబవడికి చెందిన ఓ యువతికి ఓ వివాహ వేడుకలో వస్ట్రాల్కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. అనంతరం వీరిద్దరూ ప్రేమలోపడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. తమ ప్రేమను ఇంట్లో వారు అంగీకరించకపోవచ్చని, వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని ఆ యువతి భయపడింది. ఆ యువతి, ప్రేమికుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. పెళ్లయిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో తన భర్త.. తన బంధువని, వరుసకు సోదరుడవుతాడని ఆ యువతికి తెలిసింది. దీంతో ఈ ప్రేమికుల జంట తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వీరిద్దరూ మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు విడాకులు ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles