No "blanket ban" on PM Narendra Modi's 'Mann ki baat': EC

Ec rules out blanket ban on pm s mann ki baat

PM Narendra Modi, Mann ki Baat, Election Commission, EC, Bihar assembly polls, Bihar

The Election Commission today ruled out a "blanket ban" on Prime Minister Narendra Modi's 'Mann ki baat' radio programme amid reports that the Congress is likely to approach the poll body with such a demand alleging it "violates" the Model Code of Conduct in force due to Bihar assembly polls.

ప్రధాని మనస్సులోని మాటను దేశప్రజలు ఆలకించాల్సిందే..!

Posted: 09/16/2015 06:20 PM IST
Ec rules out blanket ban on pm s mann ki baat

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దాని  మీద గంపగుత్తగా నిషేధం విధించడం కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆలిండియా రేడియోను ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. కాగా దీనిని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

అయితే, మన్ కీ బాత్ కార్యక్రమం నిజంగానే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నట్లుగా నిరూపితం అయితే మాత్రమే ఇలాంటి డిమాండును తాము పరిశీలనలోకి తీసుకోగలమని స్పష్టం చేసింది. ఈలోపు గంపగుత్తగా నిషేధం విధించడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశాలు, మన్కీ బాత్ లాంటి కార్యక్రమాలపై నిషేధం కుదరదని ఈసీలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీహార్ ఎన్నికల నేపథ్యంలో నిషేదించాలని కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు ఇవాళ ఉదయం ఈసీని కోరాయి.

ఈ మేరకు ఆ పార్టీల సీనియర్ నాయకులు న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీం జైదీని ఆయన కార్యాలయంలో కలిశారు. బీహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మన్ కీ బాత్ కార్యక్రమం నిలిపి వేయాలని వారు ఈ సందర్భంగా సీఈసీని కోరారు. అయితే కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని సీఈసీ సున్నీతంగా తిరస్కరించినట్లు సమాచారం. కాగా బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.  బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసన సభ స్థానాలకు ఐదు దశలలో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు అక్టోబర్ 12 న మొదలై.... తుది ఎన్నికలు నవంబర్ 5 తేదీతో ముగుస్తాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mann ki baat  narendra modi  bihar polls  election commission  modi mann ki baat  

Other Articles