భర్త అర్ధాంతరంగా కన్నుమూ'స్తే ఏ భార్య అయినా దిగులుచెందుతుంది. కానీ ఆలాంటి బాధ ఎవా హాలండ్ ముఖంలో ఇసుమంతా కూడా కనిపించడం లేదు. ముద్దొచ్చే ఇద్దరు పిల్లల్లో ముఖాల్లోనూ చిరునవ్వే కనిపిస్తోంది. కేవలం 26వ ఏటనే మరణించిన భర్త శవ పేటిక పక్కన పిల్లలతో నిలబడి ఫొటో దిగింది. పైగా దాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేసింది. తన భర్త తనతో 11 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని అర్ధాంతరంగా ఈలోకం వీడి వెళ్లిపోయాడని అమె సామాజిక మాద్యమాల్లో పేర్కోంది. తన భర్త మైక్ సెటిల్స్ అంటే తనకు అపార ప్రేమ. పిల్లలంటే కూడా భర్త మైక్‌కు ఎనలేని ప్రేమ.
గుండె లోతుల్లో నుంచి ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగి చిద్విలాసంగా నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది ఎవా హాలండ్. అందుకు కారణం లేకపోలేదు. అమే కాదు పిల్లలు కూడా తండ్రి పోయాడనే దు:ఖాన్ని పంటి బిగువున దాచేసి తల్లి లాగే నవ్వుతున్నారంటే వారికి ఆ తల్లి ఎవా హాలండ్ ఎంత నచ్చ చెప్పి ఉండాలి. తన భర్త శవపేటిక వద్ద పిలల్లతో కలసి ఫోటో దిగి సామాజిక మాద్యమంలో పెట్టడానికి కారణం మనల్ని ఆకర్షించాలనే. ఎందుకంటే అమె భర్త మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడి మరణించాడని, అలాగే ఎవరూ కూడా తన భర్తలాగా డ్రగ్స్‌కు అలవాటుపడి చేచేతులా జీవితాన్ని పాడు చేసుకోవద్దనే ఈ సమాజానికి సందేశం ఇవ్వడానికే ఆమె అలా చేశారట. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ లేఖ రాశారు.
తాను ఫోస్ట్ చేసిన ఫొటో చూసిన వెంటనే మీకు ఇబ్బంది కలగవచ్చు. అసహ్యం కూడా వేయవచ్చు. ఇక్కడ ఫొటో పోస్ట్ చేయడం వెనకు నా ఉద్దేశం వేరు. మేము అమెరికాలోని ఒహాయో నగరంలో ఉంటున్నాం. మైక్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అన్యోన్యంగా కాపురం చేశాం. ఎవాండేల్‌లోని జనరల్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌లో మైక్ పనిచేసేవాడు. పని ఒత్తిడంటూ నిద్ర మాత్రలు వేసుకునే వాడు. ఆ తర్వాతం మెల్లగా మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. నచ్చచెప్పినా వినలేదు. చివరకు గతేడాది ‘డీ అడిక్షన్’ సెంటర్‌లో చేరాడు. కోలుకున్నాక తిరిగొచ్చాడు. ఫేస్‌బుక్‌లో తాను ఎలా డ్రగ్స్‌కు అలవాటు పడిందీ, ఎలా దాని నుంచి బయటపడిందీ చెప్పుకుంటూ వచ్చాడు. కొద్ది రోజుల కిందట ఓసారి పన్ను నొప్పి తట్టుకోలేక మళ్లీ ఒక్క టాబ్లెట్ అంటూ డ్రగ్స్ మొదలు పెట్టాడు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు.
సెప్టెంబర్ రెండవ తేదీన 26వ ఏట చనిపోయాడు. జీవితం గురించి మైక్ ఎన్ని కలలు కన్నాడో, పిల్లల భవిష్యత్ గురించి ఎంత ఆలోచించాడో భార్యగా నాకు తెలుసు. కన్న కలలు తీరకుండానే పిల్లలను కూడా వదిలిపెట్టి వెళ్లి పోయాడు. ఈ వయస్సులో తండ్రిని పూడ్చే పరిస్థితి ఏ పిల్లలకు కలగకూడదన్నది నా తాపత్రయం, నా ప్రయత్నం. కొద్దిగా డ్రగ్స్ తీసుకున్నా ఫర్వాలేదని ఎవరూ అనుకోకూడదు. డ్రగ్స్ తీసుకునే ముందు మైక్ కూడా ఏమీ ఆలోచించి ఉంటారో ఒక్కసారి ఊహించండి. డ్రగ్స్ మిమల్ని చంపేస్తుంది’ అంటూ ఎవా హాలండ్ తన లేఖను ముగించింది. ముందుగా ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత ఆమె ఈ వివరణ ఇచ్చింది. ఆమె లేఖను ఫేస్‌బుక్‌లో దాదాపు మూడు లక్షల మంది షేర్ చేసుకున్నారు. కామెంట్లూ వచ్చాయి. అందరూ సానుకూలంగానే స్పందించారు. అందులో ఆమె పట్ల కొంత మంది సానుభూతి వ్యాఖ్యలు చేయగా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు మానేస్తామంటూ ఒట్టేసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more