256 peoples hospitalized in single day in nizambad district

Artificial toddy makes villages sick in nizambad

artificial toddy makes villages sick, artificial toddy sufferers in nizambad, 256 toddy consumers hospitalized in single day, nizambad district artificial toddy, nizambad artificial toddy, artificial toddy, villages sick, nizambad, hospitalized

artificial toddy makes villages sick in nizambad as 256 peoples hospitalized in single day after consuming toddy

కల్లుదాగి.. కల్లుదాగి.. మైకం వచ్చనా..? మైండు పోయనా..?

Posted: 09/16/2015 05:16 PM IST
Artificial toddy makes villages sick in nizambad

కల్లుదాగి, కల్లుదాగి కలుసుకుందమా.. వగలమారి వయ్యారి బామ కలుసుకుందమా అన్న పాటు వుంది కానీ, ఇలా మైకం వచ్చెనా...? మైండు పోయనా..? అన్న పాట ఎక్కడా వినిపించదే. అనుకుంటున్నారా..? కానీ ఇది అక్షరాలా నిజం. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కల్లు సేవించి.. అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరగా... జిల్లావ్యాప్తంగా మంగళవారం 256 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు.  

జిల్లాలో ఈత, తాటి చెట్లు లేక కృత్రిమ కల్లు అవసరం ఏర్పడటం..  ‘కల్లు మాఫియా’ కల్తీకల్లు అలవాటు చేయడం.. చివరికి ప్రభుత్వం ఇలాంటి కల్లుపై ఉక్కుపాదం మోపడంతో కల్లుకు బాని సలైన వారు మరణాలు, ఆస్పత్రుల పాలవుతున్నారు.  కల్లులో రసాయన పదార్థాల మోతాదు తగ్గి మాక్లూరు, కామారెడ్డి, నిజామాబాద్ మండలాల్లో మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందగా... మంగళవారం నందిపేట మండలం ఐలాపూర్‌కు చెంది న బంజ మాధవరావు (60) తనువు చాలించాడు.   ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు, ప్రస్తుతం కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే వీరి కోసం ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. రోగులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా వారి కుటుంభ సభ్యుల వినతి మేరకు కాళ్లు, చేతులు కట్టేసి మరీ వైద్యం చేస్తున్నారు వైద్యులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : artificial toddy  villages sick  nizambad  hospitalized  

Other Articles