we identified injection psycho in cctv footage says police

Injection psycho identified in cctv footage

cctv footage, psycho picture found, injection psycho found in cctv footage, andhrapradesh, injection, psycho, DGP jasti venkata ramudu, bheemavaram, narasapuram, DSP, pulsur bike, two psycho suspects in police handover, twin godavari districts

injecion psycho Who made people of twin godavari districts photogragh found in police cctv footage says bheemavaram police

ఇంజక్షన్ సైకో ఫోటోగ్రాఫ్ దొరికింది.. త్వరలోనే వాడూనూ...

Posted: 09/12/2015 04:59 PM IST
Injection psycho identified in cctv footage

ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంజక్షన్ సైకో కేసులో పురోగతి కనిపిస్తోంది. మహిళలు కనిపిస్తే చాలు ఇంజక్షన్‌తో దాడులు చేస్తూ జనాలను బెంబేలెత్తించాడు. సైకో దాడులకు జడిసి మహిళలు బయటకు వచ్చేందుకు సైతం జంకే పరిస్థితి తీసుకువచ్చాడు. వరుస దాడులతో పోలీసులకు సవాల్ విసిరాడు. ముచ్చెమటలు పట్టించాడు. ఎలాగైనా సైకో సూదిగాడిని పట్టుకోవాలని పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. సైకో క్లిపింగ్స్‌ను సీసీ కెమెరాలు పట్టేశాయి.

తమ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇంజక్షన్ సైకోను గుర్తించామని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు తెలిపారు. బాధితులు పేర్కొన్న వివరాలను పోలిన ఓ వ్యక్తిని సీసీ కెమెరాలో గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైకో సూదిగాడిని పట్టుకునేందుకు 49 చెక్ పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటుచేశారు. 400 మంది పోలీసులు సైకో జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇంజక్షన్ సైకో బ్లాక్ క్యాప్ ధరించి, బ్లాక్ హోండో షైన్ బైక్పై తిరుగుతున్నాడని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. సీసీ ఫుటేజీ సహాయంతో ఇంజక్షన్ సైకో కోసం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫొటోలు దొరికాయి కాబట్టి ఇంకా ఎంతో కాలం సైకో తప్పించుకుని తిరగలేడని పోలీసులు చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  injection  psycho  cctv footage  bheemavaram  

Other Articles