20-Year-Old Challenged Election Methods in Delhi University

Law student challenged election methods in delhi university

DU election, Ruby Malik, DU student election campaign, Aam Aadmi Party's student wing, CYSS, court. app cutout, ABVP, NSUI, guidelines flouted. in DU elections, Bhagat Singh College, movie tickets, trips to fun food village

The third year student of Law faculty called Ruby Malik has challenged the way student elections are being conducted by all parties.

ఢిల్లీ యూనివర్శటీ ఎన్నికలలో ఖర్చవుతున్న నోట్లు.. నిబంధనలకు తూట్లు..

Posted: 09/08/2015 06:08 PM IST
Law student challenged election methods in delhi university

ఢిల్లీ యూనివర్సిటీకి అధికార విద్యార్థి సంఘం గుర్తింపు కోసం జరుగుతున్న ఎన్నికలలో రాజకీయపార్టీలు అన్నిహద్దులూ మీరి ఖర్చు పెడుతున్నాయని అందరికీ తెలిసినా.. వాటిపై ధైర్యం చేసి ప్రశ్నించే గళం మాత్రం విద్యార్థులకు లేకపోయింది. ఈ రాజకీయ పార్టీల ఖర్చులను చూసి అవి రాజేసే పరిణామాల గురించి ఆలోచించిన ఓ యువతి ఇక చాలు అని నినదిస్తుంది. ఇన్నాళ్లు వేరు..ఇప్పడు వేరు... అంటూ గొంతెత్తి పలికింది. రాజకీయ పార్టీల ఖర్చులకు, ప్రచార హోరుకు కళ్లెం వేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది 20 ఏళ్ల విద్యార్థిని రూబీ మాలిక్. నాలుగేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఎంపీ ఎన్నికల మాదిరిగా డబ్బు వెదజల్లడాన్ని తాను వ్యక్తిగతంగా అడ్డుకోలేకపోయినా.. కనీసం తాను చదువుకుంుటన్న న్యాయశాస్త్ర ప్రకారం న్యాయస్థానం ద్వారా ప్రయత్నించాలని పూనుకున్నారు. ఏకంగా కోర్టు ద్వారాలు తట్టారు.

తొలిసారిగా ఆమ్ ఆద్మీపార్టీ యువ విభాగం - ఛాత్ర యువ సంఘర్ష సమితి పేరుతో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఏబీవీపీ, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా తో పోటీ పడుతోంది. ఢిల్లీ వర్సిటీ కేంపస్ లో కేజ్రీవాల్ భారీ కటౌట్ చూస్తే..వాళ్లు ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుస్తోందని ఆమె అన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన దానిని కాదని ఆమె పేర్కొన్నారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గైడ్ లైన్స్ అంతా అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కాలేజీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి రూ. 5 వేలకన్నా ఎక్కువ ఖర్చు చేయరాదు. వాహనాల ర్యాలీలు, పోస్టర్ల దందా నిషేధం. అయితే ఎవరైనా యూనివర్సిటీని సందర్శిస్తే.. సుప్రీం కోర్టు మార్గదర్శిక సూత్రాలను పట్టించుకోవడం లేదని , లక్షలు ఖర్చు చేస్తున్నారని రూబీమాలిక్ ఆరోపించారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులను ప్రశ్నిస్తే.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎన్ ఎస్ యూఐ, ఏబీవీపీతో సహా అన్ని పార్టీలూ కోట్లు గుమ్మరిస్తున్నాయని పేర్కొన్నారు. కోర్టు జోక్యంతో పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DU election  Ruby Malik  court. app cutout  ABVP  NSUI  CYSS  

Other Articles