Stunned, speechless, say AAP trio named in Mann audio leak

Aap battles voice of discontent alleges bjp govt at centre snooping

AAP battles 'voice' of discontent; alleges BJP govt at Centre 'snooping',Stunned, speechless, say AAP trio named in Mann audio leak, aap, audio leak, mann's opinion, aap audio leak, chandigarh news, phone tapping, NDA, BJP, PM modi

In the audio tape, a voice allegedly that of Mann is heard calling the trio as ‘part of one group’ trying to ‘rule and run the AAP Punjab unit.

ఫోన్ ట్యాపింగ్: జరిగిందంటూ కేంద్రంపై భగ్గుమన్న ఆప్..

Posted: 09/08/2015 06:06 PM IST
Aap battles voice of discontent alleges bjp govt at centre snooping

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున పంజాబ్‌-లో గెలిచిన ఎంపీలు భగవంత్‌-మన్, ధరంవీర్ గాంధీ టెలిఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. తమ ఎంపీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని నిప్పులు చెరిగింది. ఇందుకు భగవంత్‌-మన్, ధరంవీర్ సంభాషణల టేప్ బహిర్గతం కావడమే ఉదాహరణ అని విరుచుకుపడింది. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా లోక్‌-సభ స్పీకర్‌-కు లేఖ రాయాలని ఆప్ తమ ఎంపీలను కోరింది. టేపుల్లోని భగవంత్‌-మన్ సంభాషణకు అంత ప్రాధాన్యం లేదని ఆప్ పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్‌-పేయి మాట్లాడుతూ ఇతర పార్టీల ఎంపీలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలివి అని విమర్శించారు. ఈ అంశంపై తప్పకుండా విచారణ జరగాల్సిందే అన్నారు.

కాగా, భగవంత్-మన్- ధరంవీర్ గాంధీ సంభాషణల టేప్ సామాజిక మీడియాలో హల్‌-చల్ చేస్తోంది. ఇందులో ధరంవీర్‌-తో భగవంత్‌-మన్ మాట్లాడుతూ.. ఆప్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చీపురు గుర్తు వల్ల తాను గెలవలేదని, ప్రజల్లో తనకు ఉన్న గుర్తింపు వల్లనే గెలిచానని భగవంత్‌-మన్ అన్నారు. ఢిల్లీలో లాగా పంజాబ్ ప్రజలు గుర్తును చూసి ఓటేయలేదని, అభ్యర్థులను చూసి ఓట్లేశారని గాంధీతో వ్యాఖ్యానిస్తూ పార్టీపై తన అసంతృప్తిని మన్ వ్యక్తం చేశారు. వీరిద్దరి ఈ సంభాషణ ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజుదిగా తెలుస్తోంది.

ఈ టేప్‌-పై ధరంవీర్ స్పందిస్తూ 'మన్ వాదన సరైనదే. తను హృదయంలోని బాధను తెలియజేశాడు' అని చెప్పారు. టేప్ బహిర్గతం కావడంలో తన పాత్రపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన ఫోన్‌-కు సంభాషణలను రికార్డ్ చేసే సౌలభ్యం లేదని తెలిపారు. కాగా, నెల రోజుల క్రితమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో ధరంవీర్‌-ను ఆప్ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు భగవంత్‌-మన్ స్పందిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీకి విధేయుడ్ని అని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  audio leak  phone tapping  NDA  BJP  PM modi  

Other Articles