tdp mp | amalapuram | ravindrababu | controversial remarks | god and satillite | superstitious

Tdp amalapuram mp ravindrababu controversial remarks on god

tdp mp ravindrababu controversial remarks, amalapuram mp ravindrababu controversial remarks, ravindrababu controversial remarks on god and satillite, god is superstitious says ravindrababu, PM Modi, cm chandrababu, students, scientists, isro, rockets, Tirumala lord venkateshwara, vinayaka chavithi, diwali

tdp amalapuram mp ravindrababu controversial remarks on god, says PM and CM also encouragng these superstitious

ప్రధాని, సీఎంలు దైవత్వాన్ని ప్రోత్సహించడం.. దురదృష్టకరం..!

Posted: 09/06/2015 08:04 PM IST
Tdp amalapuram mp ravindrababu controversial remarks on god

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దైవం ఉనికినే ప్రశ్నించేలా ఆయన వ్యాఖ్యలు వుండటంతో అవి వివాదాస్పదం అయ్యాయి. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని నిలదీశారు. ఇస్రో నుంచి రాకెట్ లాంచ్ చేసే ముందు తిరిపతికి వెళ్లి కోబ్బరికాయ కోడుతున్నారని.. ఇది ఫిజిక్స్ విద్యార్థులల్లో సందేహాలను రేకిత్తిస్తుందన్నారు. పిజిక్స్ ముఖ్యమా లేక సూపర్ స్టిషియస్ ముఖ్యమా..? అన్న అనుమానాలు విద్యార్థులకు కలుగుతాయని అన్నారు. ఆదివారం ఏఎంజీ పాఠశాలలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి నమ్మకాలు కేవలం భారతదేశంలోనే వుండటం దురదృష్టకరమన్నారు. అంతేకాదు ఇలాంటి వాటిని తనతో పాటుగా ఇస్రో శాస్త్రవేత్తలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా ప్రోత్సహించడం మరింత దురదృష్టకరమన్నారు. మతం పేరున జరుగుతున్న కలుషితం తీవ్రస్థాయిలో వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి పండగ పర్వదినం పేరుతో నీటినీ, దీపావళి పండుగ రోజున గాలిని, వాతావరణాన్ని కాలుషితం చేస్తున్నామని చెప్పారు.  ఓ రకంగా ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో బడ్జెట్ లేనందున పండుగలను కంట్రోల్ చేద్దామని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp mp  amalapuram  ravindrababu  controversial remarks  god and satillite  superstitious  

Other Articles