rishiteswari suicide case: Hand over my daughter case to cbi

Handover rishiteshwari case to cbi murali krishna

Rishiteshwari, Rishiteshwari case, Rishiteshwari suicide case, Rishiteshwari issue, Anu ragging, suicide, Murali krishna, Central Bureau of Investigation, CBI, Anu ragging case, rishiteshwari, hand writing, nagajuna university, forensic report, suicide, Anu

Rishiteshwari father Murali Krishna demands Andhra pradesh government to handover his daughter case to Central Bureau of Investigation (CBI)

మా ఆమ్మాయి కేసును సిబిఐకి అప్పగించండీ.. తండ్రి డిమాండ్

Posted: 09/06/2015 08:44 PM IST
Handover rishiteshwari case to cbi murali krishna

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో.. జరిగిన అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేందుకు ఘటన పూర్వాపరాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ను, అర్బన్ ఎస్పీని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు డైరీలో రాసినందున అతడ్ని కూడా విచారించాలని కోరారు. ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని కూడా మురళీకృష్ణ వినతిపత్రంలో పేర్కొన్నారు.   

సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని ఫోరెన్సిక్ అధికారులు నివేదికలో వెల్లడించారు. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను పరీక్షించిన ఫోరెన్సిక్ అధికారులు అవన్నీ అమె చేతి రాతేనని తేల్చిన నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే.. నిజానిజాలన్నీ నిగ్గుతేలుతాయన్నారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు కేసును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ఇవన్నీ పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishiteshwari  nagajuna university  Anu ragging  CBI  Murali krishna  

Other Articles