devastating 8-year-old girl could be the next Ronda Rousey (Video)

Young girl evnika saadvakass dazzles with boxing skills

Ronda Rousey, MMA sport dominating player, bantamweight champion, very stiff competition, eight-year-old Evnika Saadvakass, Evnika terrifying boxing skills, Kazakh girl, knock-out merchant Gennady Golovkin, Evnikacan throw 100 punches a minute

The UFC posted a video of an eight-year-old Evnika Saadvakass with frankly terrifying boxing skills.

ITEMVIDEOS: నిమిషానికి వంద పంచులు విసురుతున్న 8 ఏళ్ల బాలిక

Posted: 09/06/2015 05:59 PM IST
Young girl evnika saadvakass dazzles with boxing skills

ఆ అమ్మాయి బాక్సింగ్ రింగ్‌లోకి ఎప్పుడు అడుగుపెడుతుందా... అంటూ ఆత్రంగా ఎదురుచూస్తోంది పంచ్‌ల ప్రపంచం. మనం చెప్పుకుంటోంది రష్యాలోని ఒరొనెజ్ ప్రాంతంలో నివసిస్తున్న ఎనిమిదేళ్ళ కజక్ బాలిక ఎవ్నికా సాద్వ్‌కాస్ గురించి. నిమిషానికి వంద పంచ్‌లు విసురుతూ బాక్సింగ్ రింగ్‌లో ఇప్పటి నుంచే ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ చిరుత. ఎవ్నిక సత్తా గురించి చెప్పాలంటే... పేరున్న బాక్సర్లు చాలామంది కంటే ఆమెకు మంచి టాలెంట్ ఉందంటున్నారు బాక్సింగ్ నిపుణులు.



ఆమెకు నాలుగేళ్ళ వయసున్నప్పుడే ఈ టాలెంట్ బయటకొచ్చింది. ఒంటి చేత్తో 30 సెకెండ్లలో 47 పంచ్‌లు ఇవ్వగల శక్తి ఆమె సొంతం. ఇప్పుడు బాలపులి పేరు ఇంటర్నెట్‌లో మారుమోగిపోతోంది. ఎవ్నిక తండ్రి రుస్త్రం ఇప్పుడు ఆమెతో పాటు తన ఆరుగురు కొడుకులు, కూతుళ్ళకు కూడా శిక్షణనిచ్చే పనిలో పడ్డాడు. వారంలో ఐదు రోజులు వీరంతా కలిసే సాధన చేస్తుంటారు. కనువిందు చేసే ఎవ్నిక వీడియో మీకోసం...

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Evnika Saadvakass  100 punches a minute  Ronda Rousey  Kazakh  

Other Articles