Uttarpradesh | Allahabad HC | Politicians

Politicians to send their kids to government primary schools allahabad hc orders

Uttarpradesh, Allahabad HC, Politicians, Allahabad court, School, Kids, Govt Schools

politicians to send their kids to government primary schools Allahabad HC orders UP officials The Allahabad high court on Tuesday took a serious note of the pathetic condition of primary schools in the state and directed the chief secretary to ensure that children/wards of government officials/servants, those serving in the local bodies, representatives of people and judiciary, etc., send their wards to these schools.

వాళ్ల పిల్లలయినా సర్కారీ స్కూల్లలో చదవాల్సిందే

Posted: 08/19/2015 03:11 PM IST
Politicians to send their kids to government primary schools allahabad hc orders

ఉత్తరప్రదేశ్ రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది అక్కడి అలహాబాద్ హైకోర్టు. వారంతా తమ పిల్లల్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకే పంపాలని ఆదేశించింది. ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా... సర్కారీ బడులు... బాగుపడట్లేదన్న ఆగ్రహంతో ఇలాంటి తీర్పు ఇచ్చింది ధర్మాసనం. ఈ రోజుల్లో 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకే పంపిస్తున్నారు. అక్కడ ఫీజుల మోత ఎంతున్నా, వారు రెక్కల కష్టం చేస్తున్నారే తప్ప పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ చదువులే చెప్పిస్తున్నారు. కారణం... చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతలేని వానాకాలం చదువులు ఉండటమే. సర్కారీ బడులు ఎందుకు ఇలా ఉంటున్నాయో, ప్రైవేట్ స్కూళ్లు ఎందుకంత చక్కగా ఉంటున్నాయో మనకు తెలుసు. ప్రభుత్వ స్కూళ్లను చూసినప్పుడల్లా... మనకు... వాటిపై జాలి, అధికారుల అలసత్వంపై ఆగ్రహం రావడం సహజం.

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టుకు  ఇదే అంశం మీద కోపం వచ్చింది. ఆ రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి చూసి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ఇకపై రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సర్కారీ సిబ్బంది, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నవారంతా, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా చేయాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించింది. వాళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లినప్పుడే ఆ బడులు బాగుపడతాయని వ్యాఖ్యానించింది. స్పాట్ రాష్ట్రంలో చాలా స్కూళ్లు కూలిపోయేలా ఉన్నాయనీ, చదువులు సాగట్లేదంటూ... కొందరు సామాజిక వేత్తలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆరు నెలల్లో స్కూళ్లను బాగుచేసి, వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచైనా వాటిలో అన్ని సదుపాయాలూ ఉండేలా చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఆరు నెలల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarpradesh  Allahabad HC  Politicians  Allahabad court  School  Kids  Govt Schools  

Other Articles