Indian Citizens Showing Dissatisfaction On Narenda Modi Hindi Speeches | Promote Linguistic Equality

Indian citizens showing dissatisfaction on narenda modi hindi speeches promote linguistic equality

narendra modi, modi speech, modi hindu speech, indian regional languages, delhi university, Promote Linguistic Equality, Indian citizens, narendra modi controversies

Narenda Modi Hindi Speech Controversy Indian Citizens : Indian Citizens Showing Dissatisfaction On Narenda Modi Hindi Speeches. Some People Demanding To Convert His Speech in Regional Languages

మోదీగారూ.. ఈ ‘హిందీ’ గోలేంటండి?

Posted: 08/19/2015 01:55 PM IST
Indian citizens showing dissatisfaction on narenda modi hindi speeches promote linguistic equality

మన జాతీయ భాష ‘హిందీ’ అనే విషయం అందరికీ తెలిసిందే! అయితే.. ఈ భాష ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి సరికొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నట్లు కనిపిస్తోంది. ‘అదేంటి..? ఆయనకు, ఆ భాషకు సంబంధం ఏంటి..? ఆ భాష ఈయనకు సమస్యలు తెచ్చిపెట్టడం ఏంటి..?’ అని అందరికీ సందేహం కలగకమానదు. కానీ.. ఇది వాస్తవం. అదెలా సాధ్యమని తెలుసుకోవాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రధాని మోదీ విదేశాల్లో సైతం హిందీలోనే ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే! ఇక మన దేశం విషయానికొస్తే ఆయన ప్రసంగాలన్నీ హిందీలోనే వున్నాయి. అలా ప్రసంగించినందుకే ఆయనపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. నిజానికి జాతీయ భాష హిందీయే అయినప్పటికీ.. ఇండియాలో ఆ భాషను మాట్లాడేవారు మాత్రం కేవలం 25 శాతం మందే వున్నారు. అలాంటప్పుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి.. కేవలం వారిని ఉద్దేశించి మాత్రమే ప్రసంగాలు ఎందుకు సాగిస్తున్నారని మోదీపై విమర్శలు వస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ఆయన చేసిన ప్రసంగం పట్ల పీఎల్ఈ (ప్రమోట్ లింగ్విస్టిక్ ఈక్వాలిటీ) గ్రూప్ లోని బ్లాగర్లు, టెక్కీలు తదితర నిపుణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో హిందీ మాట్లాడేవారు కేవలం 25% మాత్రమే ఉన్నారు. కేవలం వారి కోసమే ప్రధాని ఎందుకు మాట్లాడుతున్నారు’ అని పీఎల్ఈ సభ్యుడు వల్లీష్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ఈ తరహా విమర్శలు వస్తున్నాయి. స్థానిక భాషలను విస్మరిస్తున్నారని, కీలకమైన బోర్డుల్లో సైతం ఇంగ్లీష్, హిందీలను మాత్రమే వాడుతున్నారని వీరు అంటున్నారు.

అంతేకాదు.. కర్ణాటకలో రైల్వే టికెట్లు సైతం ఇంగ్లీష్, హిందీలో ఉంటున్నాయని, కన్నడంలో లేవని, బెంగళూరు నుంచి మైసూరుకు తీసుకున్న టికెట్ల విషయంలో సైతం పరిస్థితి ఇలాగే ఉందని ఆ రాష్ట్రానికి చెందిన అరుణ్ జవగల్ వాపోయారు. హిందీకి ప్రత్యామ్నాయంగా ఇంగ్లీషును తీసుకోలేమని, ఇంగ్లీషు మాట్లాడేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోందని ప్రముఖ విద్యావేత్త విభా పార్ధసారధి అభిప్రాయపడ్డారు. ‘బాలీవుడ్ సినిమాలను ఎంతమంది అర్ధం చేసుకుంటున్నారు?’ అని ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రధాని ప్రసంగం ఏ కొద్ది మందికి అర్ధం కాకపోయినా దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే’ అని ఢిల్లీ యూనివర్శిటీ హిందీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అన్నారు. దీన్ని అధికారులు గమనించి, ప్రధాని ప్రసంగాన్ని అన్ని భాషల్లోకి ఎందుకు అనువదించరని ఆయన ప్రశ్నించారు. అంటే.. మోదీ ‘హిందీ’ ప్రసంగాలు అందరికీ అర్థం కాకపోవచ్చునని, ఆయన ప్రసంగాల్ని స్థానిక భాషల్లో అనువదించాలని అపూర్వానంద్ కోరుతున్నారు. మరి.. ఈ విధంగా వస్తున్న విమర్శలపై మోదీ ఏ భాషలో సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  Promote Linguistic Equality  indian citizens  hindi language  

Other Articles