Press | Media | Channels | Novermber2

Pci for two minute silence in newsrooms on november 2

Press, Media, Channels, Novermber2, Press Council of India, Silence, harrasment

PCI for two-minute silence in newsrooms on November 2 To protest against states' failure to bring to book perpetrators of violence against journalists, the Press Council of India (PCI) wants media to protest symbolically by blacking out news for two minutes on November 2 every year.

ఆ రెండు నిమిషాలు ఏ న్యూస్ ఛానల్ పని చెయ్యదు

Posted: 08/19/2015 03:33 PM IST
Pci for two minute silence in newsrooms on november 2

రెండు నిమిషాలు…. రెండే రెండు నిమిషాలు … మీరు వార్తలను వినలేరు… చూడలేరు. దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానళ్లు ‘నవంబర్ 2′న మౌనం పాటించనున్నాయి. ప్రెస్ కైన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపుతో ఎప్పుడూ హడావుడిగా ఉండే న్యూస్ రూమ్స్ లో  ఆరోజున రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలనుంది. న్యూస్ రూమ్స్ సైలెన్స్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది PCI. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా జరిగిన 80 మంది జర్నలిస్టుల హత్యలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదు. విచారణ అంతా పెండింగ్ లోనే ఉంది. బాధితులకు న్యాయం జరగలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ప్రెస్ కౌన్సిల్. సమాచార హక్కు చట్టంలో విజిల్ బ్లోయర్లకు కల్పించినట్టుగానే జర్నలిస్టులకు రక్షణలు కల్పించాలని డిమాండ్ చేసింది.  దీంతో ‘టూ మినిట్స్ సైలెన్స్ ఇన్ న్యూస్ రూమ్స్’ పిలుపునిచ్చింది. ఏటా నవంబర్ 2న మౌనం పాటించనున్నారు.

బీహార్ లో, ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ ల మీద జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ జర్నలిస్ట్ ను బైక్ కు కట్టేసి చాలా దూరం వరకు లాక్కెళ్లి.. జర్నలిస్ట్ ను ఆస్పత్రిపాలు చేశారు. గుండాలు, రౌడీలు చేస్తున్న దారుణాలను వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్ట్ లను వాళ్లు ఎంతో కిరాతకంగా హింసిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక వ్యాపం కుంభకోణం విఫయంలోనూ అదే జరిగింది. కుంభకోణం గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ అతి దారుణంగా మృతి చెందారు. ఇలా దేశంలో  నిజాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్ట్ ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిని నిరసిస్తు జర్నలిస్ట్ మిత్రులు రెండు నిమిషాల మౌనానికి పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Press  Media  Channels  Novermber2  Press Council of India  Silence  harrasment  

Other Articles