After crocodile, now anaconda scaring people on Bangalore streets

Anaconda out of bangalore potholes

Bangalore, Anaconda, Crocodile, Anaconda man swallowed ,Bangalore, Road situation, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

The huge and scary anaconda can be seen slithering up a water-filled pothole with a human hand in its mouth. Thankfully the anaconda was not real, but a near lifelike model of the reptile.

బెంగళూరు రోడ్డుపై మనిషిని మింగిన అనకోండ..!

Posted: 08/12/2015 01:52 PM IST
Anaconda out of bangalore potholes

నిత్యం రద్దీగా వుండే రోడ్డుపై ఊహించని రీతిలో ఓ మనిషిని నోట కరుచుకున్న భారీ సైజులో అనకొండ పాదచారులను, వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేసింది. పట్టపగలే రోడ్డుపైన ఉన్న మ్యాన్‌హోల్ నుంచి అనకొండ బయటకు వచ్చి ఓ మనిషిని పూర్తిగా మింగేసింది. చివరగా ఓ చేయి మాత్రమే బయట మిగిలి ఉంది. భారీ పాము కళ్లు ఆవురావురమనిపించేలా వున్నాయి. ఈ ఘటన బెంగళూరు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. అదేంటి అనకోండ మనిషిని మింగుతుంటే.. పాదచారులు, వాహనచోదకులు ఎవరు అడ్డుకోలేదా అంటే..? మనిషి కాపాడేందుకు ప్రయత్నించలేదా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే ఇది ఓ కళాకారుడి అవేదన. ఆయన మనస్సు నుంచి పుట్టినదే ఈ ఘటన, బెంగళూరు ప్రధాన రహదారులు.. ప్రజల పాలిట మృత్యుకుహారాలుగా మారడం.. మ్యాన్‌హోల్స్, గోతులు, గుంటలపై ఆ కళాకారుడు ఇలా నిరసన వ్యక్తం చేశాడు,

నగర పాలన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్లను పరిస్థితిని అధికారులకు తెలిపేందుకు స్థానిక కళాకారుడు బాదల్ నంజుండస్వామి చేసిన ప్రయత్నమే ఇది. మొసలి, అనకొండల కంటే రహదారులపై గోతులు, గుంటలు, మ్యాన్‌హోల్స్ ప్రజలకు ప్రమాదకరంగా మారాయని అధికారులను హెచ్చరించారు. ఆ క్రమంలోనే తాజాగా అనకొండ బొమ్మను ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. వినూత్నంగా తెలిపిన నిరసన బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారుల్లో చలనం కలిగింది. డ్రైనేజీ సిస్టం పునరుద్ధరణకు పూనుకున్నారు. ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్న గుంటలు, మ్యాన్‌హోల్స్‌పై దృష్టిసారించారు. బెంగళూరులో రోడ్లపై హల్‌చల్ చేసిన మొసలి, అనకొండ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anaconda man swallowed  Bangalore  Road situation  

Other Articles