lalith Modi | Modi Gate | Parliament | Speaker

Congress party parliamentary affairs leader mallikarjun karge questions lalith modi issue

lalith Modi, Modi Gate, Parliament, Speaker, NDA, Sushma swaraj, Narendra Modi

Congress Party Parliamentary affairs leader Mallikarjun karge questions Lalith Modi issue. Speaker Sumithara mahajan gave permission to discuss about lalith ModiGate.

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా..? మోదీ ప్రభుత్వాన్ని కడిగేసిన ఖర్గే

Posted: 08/12/2015 03:53 PM IST
Congress party parliamentary affairs leader mallikarjun karge questions lalith modi issue

ఎన్డీయే ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన లలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్ లో మొత్తానికి చర్చసాగింది. 150 నిమిషాల పాటు లలిత్ గేట్ మీద మాట్లాడటానికి స్పీకర్ సుమిత్రామహాజన్ అనుమించారు. అయితే లలిత్ మోదీ వ్యవహానం మీద సుష్మాస్వరాజ్, ఎన్డీయే ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. సుష్మా స్వరాజ్ ను, ఎన్డీయే ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతో ఖర్గే నిలదీశారు. పార్లమెంట్ సాక్షిగా ఎన్డీయే ప్రభుత్వం మీద మల్లికార్జున ఖర్గే సందించిన ప్రశ్నలు ఇవే...

* లలిత్ మోదీకి సంబందించిన పత్రాలను ఎందుకు రహస్యంగా ఉంచారు..?
* లలిత్ మోదీకి తాత్కాలిక పద్దతిలో అనుమతి పత్రాలు ఎందుకు ఇవ్వలేదు..?
* లలిత్ మోదీ సహాయం చేయాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు..? దీనికి ఎవరు ఆమోదం తెలిపారు..?
* బ్రిటన్ అనుమతి ఇస్తున్న సమయంలో భారత్ అభ్యంతరం తెలిపిందా.? లేదా..?
* లలిత్మోదీకి నివాస పత్రాన్ని ఎలా మంజూరు చేశారు..?
* ట్రావెల్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత మోదీ ఎక్కడకు వెళ్లారు..?
* పోర్చుగల్ వెళ్లారు, వియన్నా వెళ్లారు. రిసార్టుల్లో తిరిగారు. మానవ దృక్పథంతో ఇచ్చిన అనుమతి ఇదేనా..?
* మోదీని వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది..?
* లలిత్ మోదీ కుటుంబానికి సుష్మా స్వరాజ్ కు ఉన్న సంబందం ఏంటి..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalith Modi  Modi Gate  Parliament  Speaker  NDA  Sushma swaraj  Narendra Modi  

Other Articles