Girl dies after immolating herself over sexual harassment

Dalit girl set herself ablaze over sexual harassment

Chandigarh, Dalit girl sexual harassment, girl set herself ablaze, Kala Banjara village, Punjab Police, Chief Minister Parkash Singh Badal, judicial magistrate, lewd remarks, gestures, Lehragaga town, doctor, abetment to suicide, crime in punjab, crime in chandigarh, crime in Sangrur district, Sangrur district, rape, gang rape, violence against women, crime against women, harrassment against women

A 16-year-old Dalit girl from Punjab's Sangrur district, who had set herself ablaze following alleged sexual harassment by youth from upper castes, died here on Tuesday.

డాక్టర్ కావాలనుకుంది.. యువకుల లైంగిక వేధింపులకు బలైంది..

Posted: 08/11/2015 09:52 PM IST
Dalit girl set herself ablaze over sexual harassment

పంజాబ్ లో దారుణం జరిగింది.. దళిత వర్గానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు అసభ్య పదజాలంలో తిట్టడం.. లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాలిక తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా.. ఇంకా దేశంలో వర్గాల వివక్ష, వర్ణాల వైరి కోనసాగుతుందని ఈ ఘటన తెలియజేస్తుంది. అగ్రవర్ణాల యువకుల చేతిలో నిత్యం వేధన అనుభవించే కన్నా ప్రాణాలను తృణప్రాయంగా వదలడం మేలని భావించిన ఈ బాలిక ఈ ఘటనకు పాల్పడింది.

సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన పంజాబ్ లోని సంగూర్ జిల్లాలోని కాలా బంజారా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ కావాలన్న ఉన్నత ఆశయంతో క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తూ.. చదువులలో రాణిస్తున్న ఓ దళిత బాలకను అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు నిత్యం లైంగిక వేధింపులకు గురిచేసేవారు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న లెహ్రాగాగ పట్టణంలో వున్న పాఠశాల వరకు ఫాలో అవుతూ వేధించేవారు. ఒకసారి వారికి ఎదురుతిరిగినందుకు బాలికపై అగ్రవర్ణాల యువకుడు చేయికూడా చేసుకున్నాడు. అంతేకాదు అసభ్యపధజాలంలో పిలవడం, నలుగురి కించపర్చేలా మాట్లాడటంతో బాలిక తీవ్ర మనోవేధనకు లోనైంది. దీంతో ఈ నెల 8న ఒంటిపై కిరోసిన్ పోసుకుని అథ్మహత్యకు పాల్పడింది. కాగా గత మూడు రోజులగా అస్పత్రిలో చికిత్స పోందుతున్న బాలిక ఇవాళ మరణించింది.

కాగా తనను ఎవరెవరు వేధించారన్న విషయమై స్థానిక మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు పేర్కోంది. దానిని ఆధారంగా చేసుకుని మైనర్ బాలిక వేధింపుల సెక్షన్ తో పాటు దళిత బాలికను వేధించిన నేరం, కించపర్చేలా మాట్లాడటం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుల కోసం అన్వేషిస్తున్నామని, అయితే వారందరూ పరారీలో వున్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dalit girl  sexual harrassment  immolation  crime news  

Other Articles